సొంత భార్యను ఈమె విడో అని వ్యాపారవేత్తకు పరిచయం చేసిన భర్త, సీన్ కట్ చేస్తే ఏం జరిగిందంటే ?
ఓ వ్యాపారిని హనీట్రాప్ చేసిన ముఠాను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఖలీమ్, సభా, ఒబేద్ రకీమ్, అతిక్ అరెస్టు అయిన నిందితులు. నిందితులు అతిఫుల్లా అనే వ్యాపారిని హనీట్రాప్ చేసేందుకు వెళ్లి బెంగళూరు సీసీబీ వలలో చిక్కారు.అరెస్టు అయిన నిందితుల్లో ఖలీం, సభా ఇద్దరూ భార్యాభర్తలు. అయితే భర్త ఖలీం తన భార్య సభాహల్ అలియాస్ సషభా వితంతువు అని వ్యాపారవేత్త అతిఫుల్లాకు పరిచయం చేశాడు.
అంతేకాదు సభాను జాగ్రత్తగా చూసుకోమని కోరాడు. ఆ తర్వాత ఖలీం భార్య సభా, వ్యాపారవేత్త అతివుల్లాల మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. కొంతకాలం తరువాత సభా, అతివుల్లా శారీరక సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. సభా అందానికి దాసోహం అయిన వ్యాపారవేత్త అతివుల్లా ఆమె చెప్పినదానికంతా తల ఊపడం మొదలుపెట్టాడు.

కొద్దిరోజుల తర్వాత ఆర్ఆర్ నగర్ లో రూమ్ బుక్ చేసుకుందామని సభా ఆమె ప్రియుడు అతివుల్లాకు మెసేజ్ పంపించింది. ఆధార్ కార్డు తీసుకురావాలని అతిఫుల్లాకు సభా చెప్పింది. గదిని బుక్ చేసిన అనంతరం వ్యాపారవేత్త అతివుల్లా అతని ప్రియురాలు సభాతో రొమాన్స్ చెయ్యడం మొదలుపెట్టాడు. సభా కూడా అతివుల్లాకు స్వర్గం చూపిస్తూ అతన్ని వేరే లోకానికి వెళ్లేలా సరసాలు ఆడింది.
ఆ సమయంలో నిందితులు కొంతసేపటికే లాడ్జ్ లోని రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. నిందితులు ఒక్కసారిగా రూమ్ లోపలికి ప్రవేశించి పెద్ద సీన్ క్రియేట్ చేశారు. ఖలీమ్, రకీబ్, అతిక్ సుఖా రూమ్ లో నానా హంగామా చేశారు. మా బంధువు అయిన సభాతో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావని, ఈ విషయాన్ని మీ కుటుంబానికి చెబుతామని, నువ్వు సభాను పెళ్లి చేసుకుని నీ ఆస్తిలో వాటా ఇవ్వాలని నిందితులు వ్యాపారవేత్త అతివుల్లాను బెదిరించారు.

ఇలా చెయ్యకుండా సైలెంట్ గా ఉండాలంటే మాకు రూ. 6 లక్షల రూపాయలు ఇవ్వాలని నిందితులు అతివుల్లాను డిమాండ్ చేశారు. అయితే డబ్బులు తరువాత ఇస్తానని వారిని నమ్మించిన వ్యాపారి అతివుల్లా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న బెంగళూరు సీసీబీ పోలీసుల బృందం దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్ గా హనీట్రాపింగ్ చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
ఈ టీమ్ మోసం చేసిందని చాలా మంది ఇప్పటికీ అనుమానిస్తున్నారు. దీంతో ప్రస్తుతం బెంగళూరు సీసీబీ పోలీసులు విచారణ కొనసాగిస్తూ ఆర్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో నిందితులు అందరిమీద కేసు నమోదు చేశారు. డబ్బు కోసం సొంత భార్యను స్నేహితుడైన వ్యాపారవేత్తకు వల వేసి హనీట్రాప్ తో లక్షల రూపాయలు వసూలు చెయ్యడానికి కట్టుకున్న భర్త ప్లాన్ చేశాడని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications