Tomato: 3 గంటల్లో 3000 కిలోల టమాటా కొనుగోలు చేశారు..
దేశవ్యాప్తంగా టమాట ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో టమాటా కిలో రూ.300 లకు పైగా పలుకుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కిలో టమాటా రూ.130 నుంచి రూ.160 గా ఉంది. టమాటాలే కాకుండా పచ్చి మిర్చి, అల్లం ధరలు కూడా భారీగా పెరిగాయి. టమాటా ధరలు భారీగా పెరగడంతో చాలా మంది వంటల్లో టమాటా వాడడమే మానేశారు.
కొందరైతే.. వారాని ఒక్కసారి చికెన్, మటన్ వండుకున్నట్లుగా వారానికోసారి టమాటా కర్రీ చేసుకుంటున్నారు. రూ.150 లకు పైగా ఉన్న టమాటా ధరలతో ఆందోళన చెందున్న సామాన్యులకు ఓ చోట కిలో టమాటా రూ.80 లకే విక్రయించారు. ఈ విషయం తెలుసుకున్న అందరూ గంటల్లో 3000 కిలోల టమాటాలను కొనుగోలు చేశారు.

ఉత్తర ప్రదేశ్, కాన్పూర్ లోని నేషనల్ కన్స్యూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సిసిఎఫ్) మొబైల్ వ్యాన్‌ల ద్వారా టమాటాలు విక్రయిస్తోంది. కిలో టమాటా 80 రూపాయలకే అమ్మడంతో కొనుగోలు చేయడానికి జనలు ఎగబడ్డారు. 3 గంటల్లో 30 క్వింటాళ్ల టమాటాను కొనుగోలు చేశారు. ఆ తర్వాత చాలా మంది టమాటా కొనుగోలు చేయడానికి వచ్చారు. కానీ టమాటాలు లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు.
భారీగా పెరిగిన టమాటా ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు ఎన్సిసిఎఫ్ ఇలా సబ్సిడీలో టమాటాలను విక్రయిస్తోంది. కాన్పూర్ వ్యాప్తంగా 10 ప్రాంతాల్లో టమాటాలు అమ్మినట్లు ఓ అధికారి తెలిపారు.అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా టమాటాలను రాయితీతో విక్రయిస్తున్నారు.












Click it and Unblock the Notifications