వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైలుకు ఎదురుగా వెళ్ళి,చివరికిలా...డ్రైవర్ అలా..

ఓ మహిళ తృటిలో ప్రాణపాయం నుండి తప్పించుకొంది. మహిళ ప్రాణాలను కాపాడేందుకు రైలు డ్రైవర్ తీవ్రంగా ప్రయత్నించాడు. ఎట్టకేలకు ఆ మహిళకు అతి సమీపంలోకి వెళ్ళి రైలు ఆగిపోయింది. ఈ ఘటన ముంబాయిలో చోటుచేసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై:ఓ మహిళ తృటిలో ప్రాణపాయం నుండి తప్పించుకొంది. మహిళ ప్రాణాలను కాపాడేందుకు రైలు డ్రైవర్ తీవ్రంగా ప్రయత్నించాడు. ఎట్టకేలకు ఆ మహిళకు అతి సమీపంలోకి వెళ్ళి రైలు ఆగిపోయింది. ఈ ఘటన ముంబాయిలో చోటుచేసుకొంది.

ముంబై సెంట్రల్ రైల్వేస్టేషన్ నుండి చర్చ్ గేట్ బౌండ్ ఫాస్ట్ ట్రైన్ బయలుదేరింది.గ్రాంట్ రోడ్ రైల్వేస్టేషన్ దాటిన తర్వాత రైలు 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. తర్వాత చర్చిరోడ్ స్టేషన్ కు సమీపించగా, ఓ మహిళ పరధ్యానంతో రైలు పట్టాలప నడుచుకొంటూ ఎదురుగా వస్తోంది.

ఆ మహిళను గమనించిన రైలు డ్రైవర్ సంతోష్ కుమార్ గౌతమ్ గమనించాడు. అతను హరన్ మోగించినా ఆమెవినిపించుకోలేదు.

a lady safe escape from train accident

ఆమె రైలు ఎదురుగా వస్తూనే ఉంది.అయితే ఆమెను రక్షించేందుకుగాను గౌతమ్ వెంటనే అప్రమత్తమయ్యాడు. రైలును నిలిపివేశాడు.అయితే 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తోన్న రైలు ఆమెను సమీపిస్తోంది.

సమీపానికి రైలు చేరుకోగానే ఆమె రైలును గమనించింది. దీంతోఆమె ప్లాట్ ఫారమ్ ఎక్కేందుకు ప్రయత్నించింది.అయితే ఫ్లాట్ ఫామ్ ఎత్తుగా ఉండడంతో సాధ్యం కాలేదు.

ఆమెకు మరో మార్గం లేదు. రైలు కిందపడి చనిపోతోందని అందరూ భావించారు. కాని, రైలు ఆమెకు అతి సమీపంగా వెళ్ళి నిలిచిపోయింది.

రైలు డ్రైవర్ , ఇతర ప్రయాణీకుల సహయంతో ఆమెను ఫ్లాట్ ఫామ్ పైకి ఎక్కించాడు.రైల్వే ఫ్లాట్ ఫామ్ పై రైలు నిలిచిపోయిన విషయాన్ని అధికారులకు చేరవేశాడు డ్రైవర్ గౌతమ్.

గౌతమ్ ను సన్మానించి నజారాను అందిస్తామని పశ్చిమ రైల్వేశాఖ ప్రకటించింది. అయితే తృటిలో ప్రాణాపాయాన్ని తప్పించుకొన్న మహిళ ఎవరనే విషయాన్ని ఇంకా గుర్తించలేదు.అయితే ఈ ఘటన గత ఏడాది డిసెంబర్ 6వ, తేదిన చోటుచేసుకొంది.

అయితే ఈ తతంగమంతా సోషల్ మీడియోలో వీడియోనుపోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఓ మహిళను కాపాడేందుకు డ్రైవర్ చూపిన చొరవను పలువురు అభినందిస్తున్నారు.

English summary
a lady safe escape from train accident in Mumbai on dec 6th 2016. this video viral on social media
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X