విటుడితో పెళ్లి: ఇది సెక్స్ వర్కర్ రెండేళ్ల ప్రేమ కథ!
వ్యభిచార కూపంలో మగ్గుతున్న ఓ యువతి తన దగ్గరికి వచ్చే యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరి మనసులు కలిశాయి. దీంతో మూడుముళ్ల బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు.
న్యూఢిల్లీ: వ్యభిచార కూపంలో మగ్గుతున్న ఓ యువతి తన దగ్గరికి వచ్చే యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరి మనసులు కలిశాయి. దీంతో మూడుముళ్ల బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా వారిద్దరు వివాహం చేసుకున్నారు. ఈ ఘటన దేశ రాజధానిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. జీబీ రోడ్ నెం. 68 ప్రాంతంలోని వ్యభిచార గృహంలో తను అష్టకష్టాలు పడుతుండేది. ఈ క్రమంలో తన దగ్గరకు వచ్చే యువకుడితో ప్రేమలో పడిందా యువతి. అలా రెండేళ్లు గడిచిపోయాయి. ఒక రోజు తనను ఎలాగైనా ఈ కూపం నుంచి బయటపడేయాలని అతడ్ని కోరింది.

అతనికి కూడా ఆమె అంటే ప్రేమ ఉండటంతో ఆ యువకుడు ఢిల్లీ మహిళా కమిషన్‌ను ఆశ్రయించాడు. ఈ విషయంలో మహిళా కమిషన్ చొరవ చూపడంతో ఆ యువతి వ్యభిచార కూపం నుంచి బయటపడింది. తర్వాత ఆ అమ్మాయికి అండగా నిలబడతానని ప్రమాణం చేస్తూ తన కుటుంబసభ్యులు, కమిషన్ సమక్షంలో బుధవారం ఆర్యసమాజంలో పెళ్లి ఆమెను పెళ్లి చేసుకున్నాడీ యువకుడు.
ఈ సందర్భంగా ఢిల్లీ మహిళా కమిషన్ సభ్యులు ఆ యువకుడ్ని అభినందించారు. 'ఊరికే మాటలు చెప్పేవాళ్లు చాలా మంది ఉంటారు.. నీలా చేసి చూపించేవారు తక్కువ మంది ఉంటారు' అంటూ అతడ్ని ప్రశంసించారు. జీబీ రోడ్ లోని ఇతర బాలికలను కూడా తాము కాపాడతామని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ తెలిపారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications