Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భార్య శీలం మీద అనుమానం, చెప్పినా వినలేదని 30 చోట్ల కసితీరా పొడిచి, ఓ పనైపోయింది !

బెంగళూరు/మడికేరి: భార్య శీలం మీద అనుమానంతో ఆమెను భర్త అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలోని మడికేరిలో జరిగింది. భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం సాగిస్తుందనే అనుమానంతో ఆమెను భర్త 30 చోట్లకు పైగా కత్తితో అతి కిరాతకంగా పొడిచి హత్య చేశాడు. భార్య జుబైదా (25)ను కసితీరా హత్య చేసిన భర్త మహమ్మద్ షరీఫ్ (27)ను మడికేరి పోలీసులు అరెస్టు చేశారు.

నువ్వంటే నాకిష్టం

నువ్వంటే నాకిష్టం

మడికేరిలో నివాసం ఉంటున్న మహమ్మద్ షరీఫ్ తో కేరళలోని కాసరగూడుకు చెందిన జుబైదాల వివాహం ఏడు సంవత్సరాల క్రితం జరిగింది. మహమ్మద్ షరీఫ్ దంపతులకు ఐదు, మూడేళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమారులు ఉన్నారు. నువ్వంటే నాకిష్టం అంటూ మహమ్మద్ షరీఫ్ భార్య జుబైదాను ఎంతగానో ప్రేమించాడు.

ఎవరితో తిరుగుతున్నావ్ ?

ఎవరితో తిరుగుతున్నావ్ ?

ప్రతిరోజూ పని మీద బయటకు వెలుతున్న మహమ్మద్ షరీఫ్ రాత్రి ఇంటికి తిరిగి వెళ్లిన తరువాత నేను లేని సమయంలో నువ్వు ఎవరితో తిరుగుతున్నావ్ ? అంటూ భార్య జుబైదాతో గొడవ పెట్టుకునే వాడని తెలిసింది. నేను లేని సమయంలో భార్య జుబైదా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం సాగిస్తోందని మహమ్మద్ షరీఫ్ కు అనుమానం ఎక్కువ అయ్యింది.

ఇలాంటి భార్య వద్దు

ఇలాంటి భార్య వద్దు

భార్య జుబైదా శీలం మీద అనుమానంతో భర్త మహమ్మద్ షరీఫ్ ఆమెకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించాడు. ఇదే విషయంలో జుబైదాతో గొడవపడిన మహమ్మద్ షరీఫ్ భార్యను కాసరగూడులోని పుట్టింటిలో వదిలిపెట్టి వచ్చాడు. అయితే పెద్దలు జుబైదాకు బుద్ధిమాటలు చెప్పి ఇటీవల మడికేరికి పిలుచుకుని వచ్చి మహమ్మద్ షరీఫ్ ఇంటిలో వదిలిపెట్టారు.

భార్య పంచాయితీ మళ్లీ మొదలైయ్యింది

భార్య పంచాయితీ మళ్లీ మొదలైయ్యింది

భార్య జుబైదాను పుట్టింటిలో వదిలిపెట్టి వచ్చినా మళ్లీ తిరిగి వచ్చిందని మహమ్మద్ షరీఫ్ అసహనంతో రగిలిపోయాడు, రెండు రోజుల క్రితం మహమ్మద్ షరీఫ్ అతని ఇద్దరు కుమారులను మడికేరిలోని వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్న తల్లిదండ్రుల ఇంటిలో వదిలిపెట్టి వచ్చాడు.

 కసితీరా 30 సార్లు పొడిచి !

కసితీరా 30 సార్లు పొడిచి !

రాత్రి ఇంటిలో భార్య జుబైదాతో గొడవ పెట్టుకున్న మహమ్మద్ షరీఫ్ నువ్వు ఎవరితో తిరుగుతున్నావు చెప్పు ? అంటూ గొడవ పెట్టుకున్నాడు. దంతపతుల మధ్య మాటామాటా పెరిగిపోయింది. ఆ సమయంలో సహనం కొల్పోయిన మహమ్మద్ షరీఫ్ కత్తి తీసుకుని భార్య జుబైదా శరీరం మీద 30 చోట్లకు పైగా దారుణంగా పొడిచాడు. జుబైదా గట్టిగా కేకలు వెయ్యడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

 చంపేస్తే ఓ పనైపోతుంది

చంపేస్తే ఓ పనైపోతుంది

పోలీసులు సంఘటనా స్థాలానికి చేరుకుని చూడగా జుబైదా రక్తపుమడుగులో స్పృహలేకుండా పడిపోయింది. వెంటనే జుబైదాను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు చెప్పారు. భార్య శీలం మీద ఆమెను అతి కిరాతకంగా హత్య చేసిన మహమ్మద్ షరీఫ్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+