భవిష్యత్‌లో భారత జవాన్ ఇలా ఉండబోతోన్నాడు..!!

భారత ఆర్మీ సరికొత్తగా జెట్ ప్యాక్స్ ను కొనుగోలు చేయబోతోంది. దీనికోసం ఓ స్టార్టప్ తో ఒప్పందాలను కూడా కుదుర్చుకుంది. జెట్ ప్యాక్ ధరించిన జవాన్ ఎలా ఉంటాడనే రూపురేఖలను విడుదల చేసింది.

బెంగళూరు: ఇండియన్ సిలికాన్ సిటీ బెంగళూరు- ఎయిర్ షో కోసం సన్నద్ధమైంది. బెంగళూరు శివార్లలోని యలహంకలో వైమానిక దళానికి చెందిన ఎయిర్ పోర్ట్ వేదికగా ఈ షో ఆరంభం కాబోతోంది. ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో పాల్గొనడానికి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బెంగళూరుకు చేరుకున్నారు. ప్రతి రెండు సంవత్సరాలకోసారి జరిగే ఎయిర్ షో ఇది. 1996 నుంచి ఇప్పటివరకు 13 సార్లు దీనికి బెంగళూరు ఆతిథ్యాన్ని ఇచ్చింది.

యూఎస్ కూడా..

యూఎస్ కూడా..

ఈ ఎయిర్ షోలో అమెరికా కూడా పాల్గొనబోతోంది. ఇప్పటికే అమెరికన్ ఎయిర్ ఫోర్స్ అధికారుల బృందం బెంగళూరుకు చేరింది. భారత్ లోని అమెరికా ఛార్జ్ డీ అఫైర్స్ ఎలిజబెత్ జోన్స్ దీనికి సారథ్యాన్ని వహిస్తోన్నారు. సుదీర్ఘకాలంగా రక్షణ, వాణిజ్య రంగాల్లో భారత్ తో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తోన్నామని, దీన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఈ ఎయిర్ షోలో పాల్గొన్నట్లు తెలిపారు.

జెట్ ప్యాక్ ధరించిన మోడల్ జవాన్..

జెట్ ప్యాక్ ధరించిన మోడల్ జవాన్..

ఈ ఎయిర్ షో సందర్భంగా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా స్టాల్ ను నెలకొల్పింది. రక్షణ రంగంలో కొనసాగుతున్న దేశీయ స్టార్టప్స్ తమ ఉత్పత్తులను ప్రదర్శించడానికి ఈ వసతి కల్పించింది. జెట్ ప్యాక్ ధరించిన భారత ఆర్మీ జవాన్ ఎలా ఉంటాడనేది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇలాంటి మోడల్ జవాన్ ను విడుదల చేయడం ఇదే తొలిసారి.

యూఎస్, యూకేల్లో..

యూఎస్, యూకేల్లో..


జెట్ ప్యాక్స్ ను అమెరికా, బ్రిటన్ ఇప్పటికే వినియోగిస్తోన్నాయి. బ్రిటన్ కు చెందిన రాయల్ నేవీ, అమెరికాకు చెందిన మెరైన్స్ కార్ప్స్ వీటిని ఉపయోగిస్తోన్నాయి. సైన్యాన్ని ఆధునికీకరించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ తరహా జెట్ ప్యాక్ సూట్‌లను కొనుగోలు చేయనుంది. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ ను కుదుర్చుకుంది కూడా. దేశీయ స్టార్టప్స్ ఈ జెట్ ప్యాక్ సూట్స్ ను అభివృద్ధి చేశాయి. రక్షణ మంత్రిత్వ శాఖకు త్వరలోనే వాటిని అందజేయనున్నాయి.

48 జెట్ ప్యాక్ సూట్స్..

48 జెట్ ప్యాక్ సూట్స్..

మొత్తంగా 48 జెట్ ప్యాక్స్ సూట్స్ ను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఫాస్ట్ ట్రాక్ విధానంలో అత్యవసర సేకరణ కింద ఈ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలిదశలో నార్తరన్ సెక్టార్ లో చైనాతో పంచుకుంటోన్న వాస్తవాధీన రేఖ వెంబడి పహారా కాసే సరిహద్దు భద్రత జవాన్లకు ఈ జెట్ ప్యాక్ సూట్స్ ను అందజేయనుంది రక్షణ మంత్రిత్వ శాఖ.

ఎలా పని చేస్తాయంటే..?

ఎలా పని చేస్తాయంటే..?

జెట్ ప్యాక్ సూట్స్ సినిమాల్లో చూసిన వాటికి పూర్తిగా భిన్నం. సినిమాల్లో చూపించిన వాటి కంటే ఇవి మరింత అత్యాధునికమైనవి. దీన్ని ధరించడానికి ప్రత్యేకంగా శిక్షణ కూడా అవసరమౌతుంది. చైనా వెంబడి సరిహద్దుల్లో సైనిక కార్యకలాపాలను మరింత విస్తృత పర్చడంలో భాగంగా ఈ జెట్ ప్యాక్ సూట్స్ ను వినియోగిస్తామని, అత్యంత సంక్లిష్టమైన భూభాగాల్లో గస్తీని మరింత పెంచడానికి ఇవి ఉపయోగపడతాయని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+