రూ.5 కోట్లు ఇవ్వకపోతే ఫోటోలు బయటపెడతా, ఎంపీనే బ్లాక్ మెయిల్ చేస్తున్న మహిళ

తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ ఏకంగా ఓ ఎంపిని బ్లాక్ మెయిల్ చేస్తోంది.ఈ విషయమై తాను అడిగినట్టుగా రూ.5 కోట్లు ఇవ్వకపోతే తనతో ఎంపి సన్నిహితంగా ఉన్న ఫోటోలను బయటపెడతానని బెదిరిస్తోంది.అయితే ఈ విషయమై తనకు

న్యూఢిల్లీ: తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ ఏకంగా ఓ ఎంపిని బ్లాక్ మెయిల్ చేస్తోంది.ఈ విషయమై తాను అడిగినట్టుగా రూ.5 కోట్లు ఇవ్వకపోతే తనతో ఎంపి సన్నిహితంగా ఉన్న ఫోటోలను బయటపెడతానని బెదిరిస్తోంది.అయితే ఈ విషయమై తనకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ చెబుతున్నారు.తనను బ్లాక్ మెయిల్ చేస్తోన్న మహిళను అరెస్టు చేయాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఓ ఎంపీనే ఓ మహిళ బురిడీ కొట్టించింది. తన గ్యాంగ్ సభ్యులతో కలిసి ఎంపీ తనపై అత్యాచారం చేసినట్టుగా ఆమె ఫోటోలు, వీడియోలు సృష్టించింది.అయితే ఆ మహిళ ఆరోపిస్తున్నట్టుగా తనకు ఎలాంటి సంబంధాలు లేవని ఆ ఎంపీ నెత్తినోరు మొత్తుకొంటున్నాడు.

blackmail

ఓ మహిళ కూల్ డ్రింకులో మత్తుమందు ఇచ్చి తాను అభ్యంతరకమైన పరిస్థితిలో ఉన్నట్టు ఫోటోలు, వీడియోలు తీశారని, ఈ ఫోటోలు బయటపెట్టకుండా ఉండాలంటే తమకు రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆ ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాము డిమాండ్ చేసినట్టుగా డబ్బులు ఇవ్వకపోతే ఆ ఫోటోలు, వీడియోలను ఇంటర్నెట్ లో పెడతామని బెదిరిస్తున్నారని ఎంపీ వాపోయాడు.తనపై అత్యాచారం చేసినట్టు కేసు కూడ పెడతానని ఎంపీని ఆ మహిళ బెదిరిస్తోందని చెప్పారు.

ఈ విషయమై ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ముఖేష్ మీనా కూడ నిర్ధారించారు. ఈ కేసును అత్యంత ప్రాధాన్యత గల కేసుగా భావిస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు. ఆ మహిళ ఏదో సహాయం కోసం తన వద్దకు వచ్చిందన్నారు. ఆ తర్వాత ఘజియాబాద్ లో ఒక ఇంటికి తనను తీసుకెళ్ళిందన్నారు.

ఆ ఇంటికి వెళ్ళగానే తనకు కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చారని చెప్పారు. మెలకువ వచ్చిన తర్వాత చూసుకొనేసరికి తాను ట్రాప్ అయిన విషయం అర్ధమైందన్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఎంపి చెబుతున్నారు.

ఆ మహిళ తన సహచరులతో కలిసి బ్లాక్ మెయిలింగ్ గ్యాంగ్ నడుపుతోందన్నారాయన. ఇదో పద్దతిలో ఆమె పలువురు పెద్దవాళ్ళ వద్దకు వెళ్ళి సహాయం అడిగి తన మెత్తటి మాటలతో బుట్టలో వేసుకొంటుందన్నారు. తర్వాత టీ తాగేందుకు ఇంటికి రమ్మని పిలిచి వాళ్ళతో అభ్యంతరకరమైన పరిస్థితిలో ఉండగా ఫోటోలు తీయిస్తోందన్నారు.

ఈ ఫోటోల సహయంతో భారీగా డబ్బులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు గానీ ఇవ్వాలని ఆమె డిమాండ్ చే్స్తోందని ఎంపీ చెప్పారు.కాదంటే రేప్ కేసు పెడుతోందన్నారు. గత ఏడాది మరో ఎంపీపై ఇదే మహిళ తప్పుడు కేసు పెట్టినట్టు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+