శాడిస్టు+సైకో కలిపితే ఈ టెక్కీ అయ్యాడు, భార్య కూడా లేడీ టెక్కీనే, రాత్రి ఇంట్లో ఏం చేశాడంటే ?

టెక్కీ దంపతులు కాపురం చేస్తున్నారు. రాత్రి ఆ టెక్కీ అతని లేడీ టెక్కీ భార్యను, కొడుకును కత్తితో దారుణంగా పొడి చేశాడు. అదే కత్తితో టెక్కీ కూడా అతని గొంతు కోసుకోవడం కలకలం రేపింది.

బెంగళూరు/బళ్లారి: యువకుడు సాఫ్ట్ వేర్ ఇంజనీరు, యువతి సాఫ్ట్ వేర్ ఇంజనీరు. ఇరు వైపుల కుటుంబ సభ్యులు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సంబంధాలనే చూశారు. యువతి, యువకుడు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చాలా గ్రాండ్ గా ఇద్దరి పెళ్లి జరిగింది. వివాహం చేసుకున్న తరువాత టెక్కీ దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు కొడుకు ఉన్నాడు. అయితే రాత్రి ఆ టెక్కీ అతని లేడీ టెక్కీ భార్యను, కొడుకును కత్తితో దారుణంగా పొడి చేశాడు. అదే కత్తితో టెక్కీ కూడా అతని గొంతు కోసుకోవడం కలకలం రేపింది.

తుమకూరు టూ బళ్లారి

తుమకూరు టూ బళ్లారి

కర్ణాటకలోని తుమకూరులో హర్షా (45) అనే వ్యక్తి నివాసం ఉండేవాడు. బెంగళూరులోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో హర్షా టెక్కీగా ఉద్యోగంలో చేరాడు. కర్ణాటకలోని బళ్లారిలో నివాసం ఉంటున్న సుధా రాణి అలియాస్ సుధా (38) అనే మహిళ బెంగళూరులోని ప్రముఖ కంపెనీలో టెక్కీగా ఉద్యోగం చేసింది. 13 సంవత్సరాల క్రితం హర్షా, సుధాల కుటుంబ సభ్యులు ఇద్దరికి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. అ సందర్బంలో కొంత టైమ్ తీసుకున్న సుధా, హర్షా తరువాత పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

బెంగళూరులో కాపురం

బెంగళూరులో కాపురం

పెళ్లికి హర్షా, సుధా ఓకే చెప్పడం, ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కావడంతో ఇద్దరి పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. వివాహం చేసుకున్న దంపతులకు ప్రథమ్ (12) అనే కుమారుడు ఉన్నాడు. గత 10 ఏళ్ల నుంచి హర్షా, సుధా దంపతులు బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్ లో కాపురం ఉంటున్నారు. హర్షా, సుధా దంపతులు బెంగళూరులోనే వేర్వేరు కంపెనీల్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు చేస్తూ కొడుకును చదివించుకుంటున్నారు.

క్వాటర్లు క్వాటర్లు తాగుతున్న టెక్కీ

క్వాటర్లు క్వాటర్లు తాగుతున్న టెక్కీ

కొంతకాలం నుంచి టెక్కీ హర్షా మధ్యం సేవించడానికి బానిస అయ్యాడు. సాయంత్రం డ్యూటీ పూర్తి అయిన వెంటనే క్వాటర్ బాటిల్ తో మద్యం సేవించడం మొదలు పెడుతున్న హర్షా రాత్రి నిద్రపోయే వరకు విపరీతంగా మద్యం సేవించడం మొదలుపెట్టాడు. మద్యం మత్తులో ఇంటికి వెలుతున్న హర్షా అతని భార్య, లేడీ టెక్కి సుధాను చితకబాదడం, లేనిపోని అనుమానాలతో ఆమెను చిత్రహింసలకు గురి చెయ్యడం మొదలుపెట్టాడని తెలిసింది. భార్య సుధా శీలం మీద అనుమానం పెంచుకున్న హర్షా ఆమెకు రానురాను నరకం చూపించాడని తెలిసింది.

భార్య, కొడుకును కత్తితో పొడిచి అదే కత్తితో ?

భార్య, కొడుకును కత్తితో పొడిచి అదే కత్తితో ?

రాత్రి హర్షా పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. తరువాత భార్య సుధాతో గొడవపెట్టుకున్న హర్షా రెచ్చిపోయాడు. తరువాత కత్తి తీసుకున్న హర్షా అతని టెక్కీ భార్య సుధాను కత్తితో దారుణంగా పొడి చేశాడు. ఎదురుగా ఏమీ చెయ్యలేక ఏడుస్తున్న కొడుకు ప్రథమ్ ను కత్తితో పొడిచిన హర్షా శాడిస్టులాగా ప్రవర్తించాడు. భార్య సుధా, కొడుకు హర్షాలను కత్తితో దారుణంగా పొడిచిన టెక్కీ హర్షా అదే కత్తితో అతని గొంతు కోసుకుని అక్కడే కుప్పకూలిపోయాడు.

శాడిస్టు+సైకో ఈ టెక్కీ

శాడిస్టు+సైకో ఈ టెక్కీ

నొప్పి తట్టుకోలేక సుధా, ఆమె కుమారుడు ప్రథమ్ కేకలు వేశారు. మద్యం మత్తులో గొంతు కోసుకున్న టెక్కీ మాత్రం సైలెంట్ గా కిందపడిపోయాడు. విషయం గమనించిన ఇరురు పొరుగు వారు హర్షా, సుధా, ప్రథమ్ లను ఆసుపత్రికి తరలించారు. టెక్కీ దంపతులు, వారి కుమారుడి పరిస్థితి విషమంగానే ఉందని, కేసు విచారణలో ఉందని రాజరాజేశ్వరి నగర పోలీసులు అన్నారు, మద్యం మత్తులో టెక్కీ భార్య, కొడుకును కత్తితో పొడిచి అతను గొంతు కోసుకోవడంతో టెక్కీ శాడిస్టు లాగా తయారైనాడని పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+