షాక్: ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ కు టైం బాంబు లాంటి వార్త: బీజేపీ!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించిన టీటీవీ దినకరన్ త్వరలో టైం బాంబు లాంటి వార్త వింటారని బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్. రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీటీవీ దినకరన్ ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో ఎలా విజయం సాధించారో అందరికీ తెలుసని హెచ్. రాజా గుర్తు చేశారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీ నాయకుల మీద విమర్శలు చేస్తున్న టీటీవీ దినకరన్ గురువారం రాత్రిలోపు ఎలాంటి వార్త వింటారో అందరూ చూస్తారని హెచ్. రాజా బాంబు పేల్చారు.

A time bomb will be blast within tomorrow night on TTV dinakaran's RK Nagar victory says BJP Raja.

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థికి కనీసం రెండు వేల ఓట్లు కూడా రాకపోవడంతో బీజేపీ నాయకులు ఆందోళన చెందారు. తమిళనాడుకు చెందిన బీజేపీ నాయకులు అందరూ ఆర్ కే నగర్ ఉప ఎన్నికలకలో ప్రచారం చేసినా ఫలితం మాత్రం శూన్యం.

ఈ నేపధ్యంలో టీటీవీ దినకరన్ గురించి బీజేపీ నాయకుడు హెచ్. రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ టైం బాంబు లాంటి వార్త వింటారని చెప్పారు. అయితే ఆ వార్త ఎదో అధికారికంగా టీటీవీ దినకరన్ కు తెలిస్తే బాగుటుందని హెచ్. రాజా అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP national secratary H Raja says, TTV Dinakaran victory in RK Nagar is a meteor. He also says A time bomb will be blast within tomorrow night on TTV dinakaran's RK Nagar victory.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి