Foreigners: ఐటీ హబ్ లో ఒకేసారి 14 మంది విదేశీయులు అరెస్టు, ఐదు మంది లేడీస్, ఏం జరిగింది ?
బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరుకు ప్రతినిత్యం వేలాది మంది విదేశీయులు వచ్చి వెలుతున్నారు. ఉద్యోగాలు చెయ్యడాకి కొందరు విదేశీయులు వస్తుంటే వ్యాపారం చెయ్యడానికి కొందరు, విహారయాత్రలకు కొందరు వచ్చి వెలుతున్నారు. బెంగళూరులో నిత్యం విదేశీయులు దర్శనం ఇవ్వడం కొత్త ఏమీకాదు. బెంగళూరు ఈశాన్య విభాగంలోని అక్రమంగా తలదాచుకున్న 14 మంది విదేశీయులను ఒకే రోజు అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. అరెస్టు అయిన వారిలో మహిళలు ఉన్నారు.

బెంగళూరు వచ్చి వెలుతున్న విదేశీయులు
గత కొన్ని సంవత్సరాల నుంచి వేలాది మంది విదేశీయులు బెంగళూరు చేరుకుని విద్యాభ్యాసం చేస్తున్నారు. బెంగళూరులోని కొన్ని కాలేజీల్లో చాలా మంది విదేశీ విద్యార్థులు ఇప్పటికి ఉన్నారు. విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత దాదాపుగా విద్యార్థులు అందరూ వారి స్వాదేశాలకు వెనుతిరిగి వెళ్లిపోతున్నారు.

గతంలో డ్రగ్స్ కేసుల్లో అరెస్టులు
అయితే బెంగళూరులో అక్రమంగా విదేశీయులు తలదాచుకోవడం, వారిని అప్పుడప్పుడు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆఫ్రికా దేశాలకు చెందిన చాలా మంది బెంగళూరులో మకాం వేసి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వెలుగు చూసింది. డ్రగ్స్ కేసులో అనేక మంది ఇప్పటికే బెంగళూరులో ఆఫ్రీకా జాతీయులు అరెస్టు అయ్యి జైలుకు వెళ్లారు.

బెంగళూరు ఈశాన్య విభాగంలో ?
బెంగళూరు ఈశాన్య విభాగంలోని అక్రమంగా తలదాచుకున్న 14 మంది విదేశీయులను ఒకే రోజు అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. బెంగళూరు ఈశాన్య విభాగంలో తలదాచుకున్న నైజీరియా, తంజానియా, ఉగండా, కెన్యా తదితర దేశాలకు చెందిన 14 మందిని అరెస్టు చేశామని డీసీపీ అనూప్ శెట్టి గురువారం మీడియాకు చెప్పారు.

ఐదు మంది మహిళలు అందర్
అరెస్టు అయిన విదేశీయుల్లో 9 మంది పురుషులు, ఐదు మంది మహిళలు ఉన్నారని, వీరు అక్రమంగా బెంగళూరులో నివాసం ఉంటున్నారని, వీరి వీసా గడుపు పూర్తి అయ్యిందని, అందరిని విచారణ చేస్తున్నామని డీసీపీ అనూప్ శెట్టి మీడియాకు చెప్పారు. మొత్తం మీద బెంగళూరులో ఒకే రోజు 14 మంది విదేశీయులు అరెస్టు కావడం హాట్ టాపిక్ అయ్యింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications