Viral Video: సాయం చేయడానికి కావాల్సింది డబ్బు కాదు.. మంచి మనస్సు.. వీడియో వైరల్..
సాయం చేయాలంటే డబ్బులుండాల్సిన అవసరం లేదు.. మంచి మనస్సు ఉంటే చాలు. ఇదే నిరూపించాడు చెప్పులు కుట్టే వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో చెప్పులు కుట్టే వ్యక్తి షాప్ పక్కకు పక్షులు వచ్చాయి. అతను అప్పుడు విత్తనాల ప్యాకెట్‌ని తీసి పక్షులకు వేశాడు.
అతను విత్తనాలను పక్షలకు వేసే ఘటన నెటిజన్ల హృదయాన్ని గెలుచుకుంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఎండీ ఉమ్మర్ హుస్సేన్ షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. ఆ వ్యక్తి ప్రతిరోజూ ఇలానే పక్షులకు విత్తనాలను ఆహారంగా వేస్తారట.

పక్షులు రోజూ అదే సమయానికి షాపు వద్దకు వచ్చి వాలుతాయట. ఈ వీడియో మనకు పాఠాన్ని నేర్పుతుంది. సాయం చేయాలంటే కోట్ల రూపాయలు ఉండాల్సిన అవసరం లేదు. మనకు ఉన్నంతలో కొంత సాయం చేస్తే చాలు. ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. చెప్పులు కుట్టే వ్యక్తిపై ప్రశంసలు కురిపించారు. సాయం చేయడానికి కావాల్సింది డబ్బు కాదు మనస్సు కావాలని ఒకరు కామెంట్ చేశారు.












Click it and Unblock the Notifications