Viral Video: వృద్ధప్యంలోనూ బతకడానికి పోరాటం.. వైరలైన వీడియో..
జీవితం అంటే నిత్యం యుద్ధమే.. ప్రతి రోజు బతకడం కోసం యుద్ధం చేయాల్సిందే. కొందరైతే వృద్ధప్యంలో కూడ బతకడానికి పోరాడాల్సి వస్తుంది. అయితే చాలా మంది నాకు ఉద్యోగం లేదు, ఆస్తులు కూడా లేవు అంటూ బాధపడుతుంటారు. కొందరైతే ఆత్మహత్య కూడా చేసుకుంటారు. కానీ వారిలాంటి వారికి ఈ వీడియో కనువిప్పు కలిగిస్తుంది.
ఓ 60 ఏళ్ల వృద్ధురాలు ట్రైన్ లో చాక్లెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు అమ్ముతున్నారు. ఆమె ఉదయాన్నే లేచి ప్యాకెట్లు పట్టుకుని ట్రైన్ లో అమ్ముతున్నారు. ఆమె బిస్కెట్, చాక్లెట్లు అమ్మడాన్ని రైలు ప్రయాణిస్తున్న ప్రయాణికులు వీడియో తీశారు. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. పోస్టుతో పాటు తెల్లవారుజామున ముగ్గురు మాత్రమే లేస్తారు. వారు తల్లి, కృషి, పట్టుదల అంటూ రాసుకొచ్చారు.

ఈ వీడియోను సోమవారం రాత్రి పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 72 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 5 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. 8 వందలకు పైగా రీట్వీట్లు చేశారు. ఈ వీడియో నెటిజన్లు స్పందించారు. మీరు గ్రేట్ అంటూ ఆమెను ప్రశంసించారు. అయితే ఆమె అంత కష్టపడి అమ్ముతుంటే ఎవరు తీసుకోవడం లేదు, ఇది దారుణమని కామెంట్ చేశారు.
सुबह जल्दी सिर्फ़ तीन ही लोग उठते हैं
— उम्दा_पंक्तियां (@umda_panktiyan) September 5, 2022
माँ, मेहनत और मज़बूरी...
~ अज्ञात pic.twitter.com/qaU9CNYrEn












Click it and Unblock the Notifications