ఏఐసీసీ ఆఫీసు ముందే మిస్ బికిని ఇండియాపై దాడి, తండ్రితో ?, వీడియో వైరల్ !

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలోని హస్తినాపూర్‌ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యడానికి గతేడాది కాంగ్రెస్‌ (congress) టికెట్‌ పొందిన 'మిస్‌ బికినీ ఇండియా' అర్చనా (Archana) గౌతమ్‌, ఆమె తండ్రిపై ఢిల్లీలోని అదే కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ఎదుట దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. అర్చనా ప్రముఖ మోడల్‌గా (miss bikini india) కూడా పని చేస్తోంది. బిగ్ బాస్ 16 కంటెస్టెంట్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న అర్చనా గౌతమ్ నిత్యం వార్తల్లో ఉంటోంది. ఇప్పుడు ఢిల్లీలోని కాంగ్రెస్ (congress)పార్టీ కార్యాలయం ఎదుటే అర్చనా గౌతమ్ ను కొట్టడం తీవ్ర కలకలం రేపింది.

బికినీ ధరించి వార్తల్లోకెక్కిన అర్చనా (Archana)గౌతమ్ కు గతంలో కాంగ్రెస్ (congress)పార్టీ టిక్కెట్లు ఇవ్వడంపై ఆ పార్టీ నాయకుల మీద గతంలోనే బీజేపీ విరుచుకుపడింది. కాంగ్రెస్ టికెట్ ప్రకటించిన వెంటనే అర్చనా (Archana)బికినీలో దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి. కాంగ్రెస్‌కు అభ్యర్థులు దొరకడం లేదు. అందుకే చీప్ జిమ్మిక్కు చేస్తోంది. సంస్కృతికి గౌరవం ఉన్న హస్తినాపురం లాంటి నియోజకవర్గాల్లో కేవలం ఓట్లు దండుకోవాలనే ఉద్దేశంతో బికిని బామ అర్చనాకు టిక్కెట్ ఇచ్చారని, ఆమెకు రాజకీయాల గురించి ఏమాత్రం తెలీదని అప్పట్లో బీజేపీ (BJP)నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేశారు.

Miss Bikini India
కాబోయే భర్తతో వెళ్లిన యువతి, గస్తీ పోలీసులు ఏం చేశారంటే ?, కొన్ని గంటలు !

ఇప్పుడు అదే అర్చనా గౌతమ్ మీద ఢిల్లీలోని ఏఐసీసీ (AICC) ప్రధాన కార్యాలయం ఎదుటే దాడి జరగడం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. అర్చనా (Archana) గౌతమ్ ఆమె తండ్రితో కలిసి కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు సంబంధించి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని (priyanka gandhi) అభినందించేందుకు అర్చనా గౌతమ్ ఆమె తండ్రితో కలిసి కాంగ్రెస్ (congress) పార్టీ కార్యాలయం దగ్గరకు వెళ్లిన సమయంలోనే ఆమె మీద దాడి జరిగింది.

అయితే తనను కాంగ్రెస్ (congress)పార్టీ కార్యాలయంలోకి అనుమతించలేదని బికిని బామ అర్చనా చెబుతున్నారు. బదులుగా తనతో పాటు తన తండ్రిని గేటు దగ్గరే కొట్టారరని, ప్రవేశ ద్వారం వద్ద కొట్టారని, రోడ్డుపైనే మా మీద భౌతికంగా దాడి చేశారని స్వయంగా అర్చనా (Archana)గౌతమ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. మమ్మల్ని ఆఫీసు లోపలికి రానివ్వలేదు. గేటు కూడా తెరవలేదని, మిమ్మల్ని లోపలకు వదలకూడదని పై నుండి ఆర్డర్ వచ్చిందని, మీ ఎంట్రీ తిరస్కరించబడిందని, అయితే దీనికి కారణం తెలీదని అర్చనా గౌతమ్ ఆరోపించారు.

Congress office in Delhi has gone viral
ఈ ఘటన గత 29వ తేదీన జరిగిందని అర్చనా మీడియా ముందు తన బాధను వ్యక్తం చేసింది. ఈ ఘటనలో తన తండ్రి, డ్రైవర్‌కు గాయాలయ్యాయని (congress)అర్చనా గౌతమ్ ఆరోపించారు. తాను ఏం తప్పు చేసాను అని అర్చనా ప్రశ్నించింది. అప్పుడే గ్రీటింగ్స్ చెప్పడానికి వెళ్ళాను కానీ ఇలా ఎందుకు చేశారో తెలియలేదు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలను కాపాడుకున్నానని బికిని బామ అర్చనా (Archana) గౌతమ్ మీడియాకు చెప్పారు.

గత ఏడాది తనకు టికెట్ ఇచ్చారనే బీజేపీ ఆరోపణపై అర్చనా (Archana)స్పందిస్తూ నేను 2014లో మిస్ ఉత్తరప్రదేశ్‌గావిజయం సాధించానని. 2018లో మిస్ బికినీ ఇండియా అయ్యానని, మిస్ కాస్మో వరల్డ్ 2018గా గెలుపోందనని అన్నారు. అయితే ఇప్పుడు సామాజ సేవ చేయాలనే ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి వచ్చానని, కళాకారులు రాజకీయాల్లోకి రాకూడదా? నటీమణులు కేంద్రంలో మంత్రులు కాలేదా?, కెరీర్, రాజకీయాలను ముడివేస్తారా (congress)అంటూ అర్చనా గౌతమ్ రాజకీయ నాయకులను ప్రశ్నించారు. అయితే అర్చనా (Archana) చేస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంత వరకు స్పందించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+