నా మొగుడు వాడి పెళ్లామ్ తో లేచిపోయింది, కాదు నా పెళ్లామ్ నిప్పు, గోల్డ్, వాడిదే తప్పు, ఏందిరా ఇది !
వివాహం చేసుకున్న దంపతులు హ్యాపీగా సంసారం చేశారు. దంపతులకు ఓ కుమార్తె ఉంది. భార్య, కుమార్తెతో కలిసి అతను చాలా హ్యాపీగా ఉండేవాడు. మరో ప్రాంతంలో అదే మతానికి చెందిన దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే భార్య, కుమార్తెతో కలిసి సంతోషంగా ఉండే వ్యక్తికి వివాహిత మహిళకు పరిచయం అయ్యింది. తరువాత కథ అనేక ట్విస్టులతో ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు చేరింది.
ఓ వివాహిత మహిళ ఆమె భర్తను వదిలేసి మరో వివాహితుడితో కలిసి పారిపోయింది. తన భార్యను వెతికి పెట్టాలని ఆమె భర్త, తన భర్తను వెతికి పెట్టాలని మరో మహిళ ఇప్పుడు బెంగళూరులోని పుట్టేనహళ్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. బెంగళూరులోని పుట్టేనహళ్లిలోని ఇలియాస్ నగర్‌లో వివాహం చేసుకుని ఇంతకాలం కాపురాలు చేసే మహిళ, మరో వ్యక్తి లేచిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.

ఏడేళ్ల క్రితం బెంగళూరులో నివాసం ఉండే సుమయ్య బాను అలియాస్ బాను అనే మహిళ, వాసీం అనే యువకుడు వివాహం చేసుకున్నారు. వాసీం, బాను దంపతులకు మూడేళ్ల కుమార్తె ఉంది. భార్య భాను, కుమార్తెతో కలిసి వాసీం చాలా సంతోషంగా జీవించేవాడు. బంధువులు పిలిచిన శుభకార్యాలు, ఫంక్షలకు వాసీం వెళ్లి వచ్చేవాడు. రెండు సంవత్సరాల క్రితం వాసీంకు దిల్ షాద్ అనే మహిళ పరిచయం అయ్యింది. దిల్ షాద్ కు ఇంతకు ముందే నయిమ్ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. భర్త నయిమ్ తో కలిసి దిల్ షాద్ రెండు సంవత్సరాల క్రితం వరకు బాగానే ఉండేది
అయితే వాసీంతో పరియం అయిన తరువాత దిల్ షాద్ రూట్ మార్చి అతనితో చనువు పెంచుకుంది. రానురాను దిల్ షాద్ తో ప్రేమలో పడిన వాసీం ఆమె మోజులోపడిపోయాడు. తరువాత వాసీం, దిల్ షాద్ నిత్యం కలవడం మొదలుపెట్టారు. అక్రమ సంబందం పెట్టుకున్న దిల్ షాద్, వాసీం తరచుగా కలుసుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టారు. భర్త నయిమ్ కు మాయమాటలు చెప్పి ఇంటి నుంచి బయటకు వెలుతున్న దిల్ షాద్ ఆమె ప్రియుడు వాసీంతో కలిసి పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తోంది.

వాసీం కూడా అతని భార్య బానుకు సినిమా స్టోరీలు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లి అతని ప్రియురాలు దిల్ షాద్ తో రొమాన్స్ చెయ్యడం మొదలుపెట్టాడు. కొన్ని నెలల నుంచి భర్త వాసీం తీరుపై అతని భార్య బానుకు అనుమానం వచ్చింది. మూడు రోజుల క్రితం బాను ఆమె భర్త వాసీంకు అనుమానం రాకుండా అతన్ని వెంబడించింది. దిల్ షాద్‌తో కలిసి జేపీ నగర్ లోని ఓ హోటల్‌లోకి వెళ్లిన వాసీం ఆమెతో రొమాన్స్ చేస్తున్న సమయంలో చూసిన బాను షాక్ అయ్యింది.
వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులకు ఫోన్ చేసిన బాను అందరిని భర్త వాసీం ఉన్న హోటల్ దగ్గరకు పిలిపించింది. బానుతో పాటు ఆమె కుటుంబ సభ్యులు రెడ్‌హ్యాండెడ్‌గా వాసీం, అతని ప్రియురాలు దిల్ షాద్ ను పట్టుకున్నారు. అలాగే భర్త వాసీంతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న దిల్ షాద్ ను పట్టుకుని ఇద్దరిని హోటల్ లోనే చితకబాదేశారు. తరువాత వాసీం, అతని ప్రియురాలు దిల్ షాద్ ను పుట్టేనహళ్లి పోలీస్ స్టేషన్‌లో అప్పగించి ఇద్దరి మీద వాసీం భార్య బాను, ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
పోలీసులు వాసీం, అతని ప్రియురాలు దిల్ షాద్ కు వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి ఇలా రిపీట్ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చి ఎవరి ఇళ్లకు వాళ్లను పంపించారు అయితే ఇప్పుడు వాసీం అతని ప్రియురాలు దిల్ షాద్ రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి అదే రోజు రాత్రి పారిపోయారు. దిల్ షాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భర్త వాసీంను వెతికి పెట్టాలని మనవి చేసింది. తన భార్య దిల్ షాద్ ను వెతికి పెట్టాలని ఆమె భర్త నయిమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త కోసం భార్య, భార్య కోసం భర్త కేసులు పెట్టడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.












Click it and Unblock the Notifications