ఘోరం: ఆలయంలో మహిళపై దాడి, జుట్టుపట్టి ఈడ్చిబయటపడేశారు
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన వెలుగుచూసింది. బెంగళూరులోని అమృతహళ్లిలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఓ మహిళపై దాడి జరిగింది. ఆమెను పదే పదే కొట్టారు. జుట్టుపట్టి ఆలయం నుంచి బయటకు ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సంఘటన డిసెంబర్ 21 న జరిగినట్లు తెలుస్తోంది. వీడియోలో.. మహిళ, ఆలయంలోని ఓ వ్యక్తి మధ్య వాగ్వాదం జరగడం చూడవచ్చు. మహిళ ఆలయం లోపల ఉంటానని పట్టుబట్టినట్లు కనిపిస్తుంది. అయితే, అతడు ఆమెను బయటకు వెళ్లగొడతాడు.

మహిళ ప్రతిఘటించడంతో ఆమెను తీవ్రంగా కొడతాడు. ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి బయటపడేస్తాడు. మరో ఇద్దరు పూజారులు కూడా ఈ వీడియోలో కనిపిస్తారు.
A Dalit woman is being assaulted and removed from the temple premises in Bangalore, India! pic.twitter.com/RkTiMT4yCe
— Ashok Swain (@ashoswai) January 6, 2023
ఆలయం బయటకు తీసుకొచ్చిన తర్వాత నిందితుడు కర్రతో కొట్టేందుకు ప్రయత్నించగా.. ఒక పూజారి అతడ్ని ఆపుతాడు. అయినా అతడు ఆగకుండా ఆమెపై దాడిని కొనసాగిస్తాడు. అయితే, బాధితురాలు దళిత మహిళ అని, ఆమెను ఆలయంలోనికి రాకుండా ఈ దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
వీడియో వైరల్ కావడంతో ఘటనపై స్పందించిన పోలీసులు.. నిందితులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.












Click it and Unblock the Notifications