Viral Video: ఇదేం పిచ్చి.. పడుకుని మరీ..!
సోషల్ మీడియా స్టార్స్ కావాలని చాలా మంది తల తిక్క పనులు చేస్తున్నారు. మెట్రో స్టేషన్లలో రీల్స్ చేయడం, రోడ్డుపైనే డ్యాన్స్ చేయడం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి డీ మార్ట్ లో చాక్లెట్ దొంగతనం చేసిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు. శుక్రవారం ఓ వ్యక్తి రీల్స్ చేయడం కోసం ట్రాఫిక్ బారికేడ్లు నిప్పు పెట్టాడు. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మార్చి 29న నిహాల్ విహార్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తాజాగా ఓ మహిళ యూట్యూబార్ విమానాశ్రయంలో రీల్స్ చేశారు. సుజాతా దహల్ అన్ మహిళ ఎయిర్ పోర్ట్ కన్వేయర్ బెల్ట్ పై పడుకుని రీల్స్ చేసింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్ల ఆమెపై మండిపడుతున్నారు. బెల్ట్ పై పడుకుని రీల్స్ చేయడం ప్రమాదమని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఆమె జుట్టు బెల్ట్ లో ఇరికితే ప్రాణాలకే ప్రమాదం అన్నారు.

సుజాతా దహల్ కు ఫైన్ వేయాలన్నారు. ఈ వీడియోను ఎక్స్(ట్విటర్)లో దేసీ మోజిటో అనే హ్యాండిల్‌లో పోస్టు చేశారు. ఈ వీడియోకు భారీగా వ్యూస్ వస్తున్నాయి. ఇప్పటి వరకు 32 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. సుజాతా ఏ ఎయిర్ పోర్టులో ఈ వీడియో చేశారో తెలియరాలేదు. దహల్ చర్యపై మాత్రం నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమె పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఓ నెటిజన్ తన సోదరి కన్వేయర్ బెల్ట్ లో పడి చేతి వేళ్లను కోల్పోయిందని గుర్తు చేశాడు. సోషల్ మీడియాలో స్టార్ కావడంతో చేసే పనులు ఒక్కోసారి ప్రాణాల మీదకు వస్తాయని చెబుతున్నారు. గతంలో చాలా మంది ఇలా ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు.
The virus has reached the airports too 🤡🤡 pic.twitter.com/RdFReWtWjH
— desi mojito 🇮🇳 (@desimojito) March 29, 2024












Click it and Unblock the Notifications