మేడమ్ తో రొమాన్స్, పక్కింటి లేడీతో ?, బెదిరించిన ఆంటీని నిజంగానే చంపేశాడు !
బెంగళూరు: వివాహిత మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వయసులో 17 ఏళ్లు చిన్నవాడైన యువకుడితో ఆమె అక్రమ సంబందం పెట్టుకుంది. ఇద్దరి మద్య గొడవలు జరిగాయి, మెడకు తాడు గించుకుని కుర్చీ మీద నిలబడిన మహిళ తాను ఆత్మహత్య చేసుకుంటానని ప్రియుడిని బెదిరించింది. అయితే కుర్చీ పక్కకు లాగేసిన ప్రియుడు ఆంటీని నిజంగానే చంపేశాడు.
బెంగళూరు నగరంలోని బసవేశ్వరనగర్ లోని జేసీ నగర్ లో సరవణమ్మ అలియాస్ సరవణి (41) అనే మహిళ నివాసం ఉంటున్నది. చాలా సంవత్సరాల క్రితం శివకుమార్ అనే వ్యక్తిని సరవణి వివాహం చేసుకుంది. శివకుమార్, సరవణి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం భర్త శివకుమార్ ను వదిలేసి విడాకులు తీసుకున్న సరవణి వేరుగా నివాసం ఉంటున్నది.

సరవణి నివాసం ఉంటున్న పక్క ఏరియాలో గణేష్ (22) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. సరవణికి, గణేష్ కు పరిచయం కావడంతో తరువాత చనువు పెంచుకుని అక్రమ సంబంధం పెట్టుకున్నారు. సరవణి, గణేష్ ల వయసులో 17 ఏళ్లు తేడా ఉంది. అయినా ఇద్దరూ అక్రమ సంబందం పెట్టుకుని ఎంజాయ్ చేశారు.
సరవణి నివాసం ఉంటున్న ఏరియా పక్కలో మరో అద్దె ఇంటిని తీసుకుని ఆమె ప్రియుడు గణేష్ ఉండటానికి ఆంటీ అన్ని ఏర్పాట్లు చేసింది. గణేష్ ఖర్చుల కోసం రూ. 50 వేలు ఇచ్చిన సరవణి ప్రియుడు గణేష్ ఎలాంటి పని చెయ్యకపోయినా అతని ఖర్చులకు చాలా డబ్బులు ఇస్తున్నది. అపార్ట్ మెంట్ లో ఇంటి పని చేస్తున్న సరవణి సంపాధించిన డబ్బులో అర్దం ఆమె ప్రియుడు గణేష్ కు ఇస్తోంది.
ఇటీవల వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న గణేష అతని ప్రియురాలు సరవణికి దూరం కావడానికి ప్రయత్నించాడు. తన ప్రియుడు వేరేదానితో కులుకుతున్నాడని తెలుసుకున్న సరవణి రగిలిపోయి అతనితో గొడవ పెట్టుకుంది. నాతో మాత్రమే నువ్వు అక్రమ సంబందం పెట్టుకోవాలని, వేరే మహిళతో తిరగకూడదని సరవణి ఆమె ప్రియుడు గణేష్ ను హెచ్చరించింది.

ఇదే విషయంలో గొడవ జరగడంతో గణేష్ కుర్చీ మీద నిలబడి ఫ్యాన్ కు తాడు బిగించి తాను ఆత్మహత్య చేసుకుంటానని అతని ప్రియురాలు సరవణిని బెదిరించాడు. ప్రియుడు గణేష్ ను కిందకు దింపిన సరవణి అతనికి బుద్దిమాటలు చెప్పింది. అయితే వేరే మహిళతో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటానని సరవణి ఆమె ప్రియుడిని బెదిరించింది.
గణేష్ అప్పటికే ఫ్యాన్ కు వేలాడదీసిన తాడు గొంతుకు బిగించకున్న సరవణి నేను ఆత్మహత్య చేసుకుంటానని కుర్చీ మీద నిలబడి ప్రియుడిని బెదిరించడానికి ప్రయత్నించింది, అయితే ప్రియుడు గణేష్ నువ్వు నిజంగానే చచ్చిపో అంటూ ప్రియురాలు సరవణి నిలబడిన ఉన్న కుర్చీని పక్కకు లాగేశాడు.
ఫ్యాన్ కు వేలాడుతు గిలగిలా కొట్టుకున్న సరవణి ఆమె ప్రియుడు గణేష్ కళ్లముందే ప్రాణాలు వదిలేసింది. ప్రియురాలు సరవణి చనిపోయిందని నిర్దారించుకున్న గణేష్ ఇంటికి బయట తాళం వేసి అక్కడి నుంచి పరారైనాడు. సరవణి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న పోలీసులు ప్రియురాలిని హత్య చేసిన గణేష్ వెంటాడని పట్టుకుని అరెస్టు చేశారు. తల్లి అక్రమ సంబంధం కారణంగా ఆమె ఇద్దరు పిల్లలు రోడ్డునపడ్డారు.












Click it and Unblock the Notifications