లవ్ ఎఫెక్ట్ : యువతిని కత్తితో పోడిచి, తాను ఆత్మహత్య చేసుకున్న యువకుడు..!

లవ్ ఫెయిల్యూర్‌‌తో ఓ యువకుడు ప్రియురాలిని కత్తితో పోడిచి , తాను సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు సంవత్సరాలుగా ప్రేమిస్తున్న యువతి తనను కాదనడంతో ఆ యువకుడు ప్రియురాలిని కత్తితో పొడిచిన అనంతరం ప్రియురాలు ఉంటున్న ఆపార్ట్‌మెంట్‌లోని పదవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

మహారాష్ట్రలోని కురార్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కురార్ ప్రాంతానికి చెందిన యువతి యువకులకు గత ఏడాదిన్నరగా పరిచయం ఉంది. కురార్‌లోని అంబేద్కర్ నగర్‌లోని నివాసం ఉంటున్న యువకుడు, యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. గత సంవత్సరన్న కాలంగా వెంటపడ్డాడు. అయితే యువతి తన ప్రేమకు అభ్యంతరం వ్యక్తం చేసింది.

 a young man killed his girlfriend and suicide.

దీంతో డైలామాలో పడ్డ యువకుడు సోమవారం ఎవరు లేని సమయంలో యువతి ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. ఆమేతో చాలసేపు మాట్లాడాడు. అనంతరం ఆమేను కత్తితో పోడిచాడు. ఈ నేపథ్యంలోనే తాను సైతం చేతిమణికట్టుపై కోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అనంతరం యువతి ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని పదవ అంతస్తుకుకు చేరుకుని పైనుండి దూకాడు. అయితే సంఘటన తర్వాత స్థానికులు రక్తపు మడుగులో ఉన్న యువతిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరిపారు. యువతి తన ప్రేమను నిరాకరించడంతోనే ఈ దారుణానికి పాల్పడ్డట్టు ప్రాధమిక అంచనాకు వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+