కారు పార్కింగ్ ఏరియాలో ప్యాంట్ జిప్ తీసిన కామాంధుడు, బెంగళూరు యువతి ఏం చేసిందంటే ?
ఒంటరిగా ఉన్న అమ్మాయిలు, మహిళల పట్ల కొందరు అసభ్యంగా ప్రవర్థిస్తున్నారని అనేక సందర్బాల్లో వెలుగు చూసింది. కొందరు బజారు కేటుగాళ్లు గాలికి తిరిగే మహిళలు అనుకుని వారితో అసభ్యంగా ప్రవర్తించడం, వాళ్లను చూసి వెకిలి చేష్టలు చెయ్యడం అక్కడక్కడా జరుగుతుంటాయి, ఎవరు సంసారం చేసే మహిళలు, ఎవరు వ్యభిచారం చేసే మహిళలు అని చాలా మంది కామాంధులు గుర్తించలేకపోయి వాళ్లతో అసభ్యంగా ప్రవర్థిస్తున్నారు.
బహిరంగ ప్రదేశంలో ఓ యువతి ఎదుటే ఓ వ్యక్తి హస్తప్రయోగం చేసుకున్న ఘటన బెంగళూరులోని మహదేవపురలోని పార్కు ఎదురుగా ఉన్న సర్వీస్ రోడ్డుపై చోటుచేసుకుంది. ఓ యువతి కారులో మహదేవపురలోని పార్క్ సమీపంలోకి వెళ్లింది. తరువాత ఆ యువతి వెళ్లిన తన స్నేహితురాలిని పికప్ చేసుకునే పని పూర్తి చేసుకోవడానికి కారు పార్క్ చేసి ఆమె కారులోనే కూర్చుంది. కారులో కుర్చున్న యువతి ఆమె మొబైల్ ఫోన్ చూసుకుంటూ కాలం గడిపింది.

ఆ సమయంలో ఓ వ్యక్తి యువతిని చూస్తూ వెకిలిచేష్టలు చేశాడు. తరువాత యువతి కారు సమీపంలో నిలబడిన ఆ కామాంధుడు ఆమెను చూసి ప్యాంట్ జిప్ తీసి అక్కడే హస్తప్రయోగం చేసుకుని కారు ముందు అటూఇటూ తిరుగుతూ ఆమెను చూస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. యువతి భయపడిపోయి కారు డోర్ లాక్ చేసుకుంది. యువతి భయపడిన విషయం గమనించిన ఆ కామాంధుడు ఇంకా రెచ్చిపోయాడని తెలిసింది.
ఆతర్వాత ఆ వ్యక్తి కారు దగ్గరకు వెళ్లి కారు చుట్టూ తిరిగాడు. అప్పుడు ఆ వ్యక్తి యువతి వైపు బెదిరింపు చూపులతో చూశాడు. అతడి దృష్టి నుంచి తప్పించుకునేందుకు ఆ యువతి కారు స్టీరింగ్ కిందకు తలదాచుకుని భయంతో గడిపింది. కొంతసేపటి తరువాత యువతి స్నేహితురాలు ఒకరు అక్కడికి రావడంతో ఆ యువతి కారు దిగింది. ఆ యువతి తాను ఎదుర్కొన్న సమస్యను ట్విట్టర్‌లో రాసింది.

ఈ ఘటన జనవరి 5వ తేదీన జరిగిందని, కేసును దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులు మహదేవపుర పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఆదేశించాలని ఆ యువతి జనవరి 8వ తేదీ రాత్రి సోషల్ మీడియాలో మనవి చేసింది. బెంగళూరు సిటీ పోలీసు అధికారుల ఆదేశాల మేరకు మహదేవపుర పోలీసులు పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications