• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Delhi Civic Polls : ఢిల్లీ కార్పోరేషన్ నూ ఊడ్చేసిన ఆప్- 15 ఏళ్ల బీజేపీ పాలనకు శుభం కార్డు

|
Google Oneindia TeluguNews

ఢిల్లీలో వరుసగా మూడోసారి అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ.. ఈసారి స్ధానిక సంస్ధల ఎన్నికల్లోనూ సత్తా చాటింది. ఇప్పటివరకూ ఢిల్లీలో ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పటికీ అటు కేంద్రం, ఇటు స్ధానిక సంస్ధల్లోనూ బీజేపీ అధికారంలో ఉండటంతో ఆప్ ప్రభావం పూర్తిగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఓటర్లు ఈసారి స్దానిక సంస్ధల ఎన్నికల్లోనూ ఆప్ కే పట్టం కట్టారు. ఆప్ విజయంపై స్పందించిన కేజ్రివాల్.. ఢిల్లీ ప్రజలకు అభినందనలు తెలిపారు. మార్పు తీసుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలన్నారు.

తాజాగా జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎంసీడీ ఎన్నికల్లో కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 250 సీట్లున్న కార్పోరేషన్ లో ఆప్ 135 సీట్లు గెల్చుకుని జయకేతనం ఎగురవేసింది. మరోవైపు ఆప్ కు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ బీజేపీ 103 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ కు 9 సీట్లు, ఇతరులకు మూడు సీట్లు దక్కాయి. దీంతో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ లో తొలిసారి ఆప్ మేయర్ రాబోతున్నారు. అదే సమయంలో 15 ఏళ్లుగా ఢిల్లీ పీఠంపై ఉన్న కమలం పార్టీ పాలనకు ఆప్ చరమగీతం పాడినట్లయింది.

aam admi party sweeps delhi civic polls with 135 seats, ends to bjps 15 year rule

ఇవాళ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అయితే ఆరంభంలో ఆప్ పై బీజేపీ ఆధిక్యం కనిపించింది. అదీ భారీ తేడాతో కావడంతో ఈసారి కూడా బీజేపీ విజయం సాధించబోతున్నట్లు అంతా అనుకున్నారు. కానీ కాసేపటికే పరిస్ధితి మారిపోయింది. ఎగ్జిట్ పోల్స్ లో ఆప్ క్లీన్ స్వీప్ సాధించబోతున్నట్లు అంచనా వేసినప్పటికీ బీజేపీ గట్టిపోటీతో ఆప్ సాధారణ విజయంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ కార్పోరేషన్ పునర్ వ్యవస్ధీకరణ తర్వాత ఇవి తొలి ఎన్నికలు. 2017లో అప్పటి 270 మునిసిపల్ వార్డుల్లో 181 స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా, ఆప్ 48 స్థానాల్లో మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ 30 స్థానాలతో మూడో స్థానంలో నిలిచింది. ఈసారి ఫలితాలు పూర్తిగా తారుమారయ్యాయి.

aam admi party sweeps delhi civic polls with 135 seats, ends to bjps 15 year rule

English summary
arvind kejriwal led aam admi party has won delhi civic polls. aap secured 136 seats against bjp's 102.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X