ఆప్ ఎమ్మెల్యే అల్కా లాంబాపై దాడి(ఫొటోలు)
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అల్కా లాంబాపై దాడి జరిగింది. ఉత్తర ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ వద్ద ఆదివారం తెల్లవారుఝామున 6 గంటలకు ఈ ఘటన జరిగింది. మాదక ద్రవ్యాల పంపిణీ, వినియోగానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నందుకు తనపై ఈ ఉదయం దాడి జరిగిందని ఆమె ట్వీట్ చేశారు.
She was targeted as she was the only one who got hit in crowd.
It's deep conspiracy. AAP will fight back. pic.twitter.com/N48JpeW6xQ
— ashutosh (@ashutosh83B) August 9, 2015 దుప్పటి కప్పుకుని వచ్చిన ఓ అగంతకుడు రాళ్లతో దాడి చేశాడు. ఈ ఘటనలో తన తల పగిలిందని ఆమె చెప్పారు. గాయపడిన అల్కా లాంబాకు ఢిల్లీలోని అరుణా అసఫ్ అలీ ఆసుపత్రిలో చికిత్స అందించారు.
9 अगस्त क्रांति दिवस .. नशे के खिलाफ यह जंग जारी रहेगी.. यह हमारी जिद्द है... pic.twitter.com/b4UT64VgB1
— Alka Lamba (@LambaAlka) August 9, 2015 దాడితో తన ఉద్యమాన్ని ఆపలేరని ఆమె ట్విటర్‌లో వెల్లడించారు. దాడి వెనుక కుట్ర దాగి ఉందని ఆప్ ఆరోపించింది.
.@LambaAlka Proud of you Alka.
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 9, 2015 కాగా, ఎమ్మెల్యే అల్కా లాంబా సాగించిన పోరాటాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ మెచ్చుకున్నారు. 'ప్రౌడ్ ఆఫ్ యూ అల్కా' అని ఆయన ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications