'సీఎం అలా ఆదేశిస్తే.. ఆ పార్టీలో ఒక్కరూ ప్రాణాలతో మిగలరు'
పంజాబ్ సీఎం కోడలు, కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించి పదునైన వ్యాఖ్యలు చేశారు.
చంఢీఘడ్: పంజాబ్‌లో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా ప్రధాన పార్టీలైన శిరోమణి అకాలీ దళ్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య మాటల యుద్దం ముదురుతోంది. తాజాగా బుధవారం నాడు పంజాబ్ సీఎం కోడలు, కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించి పదునైన వ్యాఖ్యలు చేశారు.
తమ పార్టీ అధినేత, పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ గనుక హింసాత్మక దాడులకు దిగాలని పిలుపునిస్తే.. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులు ఒక్కరు కూడా మిగలబోరని హర్సిమ్రత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీఎం బాదల్ పై సిక్కు రాడికల్ యువకుడు ఒకరు చెప్పుతో దాడి చేసిన నేపథ్యంలో బఠిండా ఎంపీ అయిన హర్సిమ్రత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేశారు. హర్సిమ్రత్ కౌర్ బాదల్ భర్త అయిన డిప్యూటీ సీఎం సుఖ్ బీర్ సింగ్ బాదల్ కాన్వాయ్ పై కూడా రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే.
గత నాలుగు వారాల్లో బాదల్ కుటుంబం లక్ష్యంగా రెండుసార్లు దాడులు జరిగాయి. అయితే ఈ దాడుల వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ హస్తముందని హర్సిమ్రత్ ఆరోపిస్తున్నారు. తమ పార్టీ శ్రేణులు గనుక తిరగబడితే ఆమ్ ఆద్మీ నామరూపాలు లేకుండా పోతుందని హెచ్చరించారు. హర్యానా మూలాలు ఉన్న కేజ్రీవాల్ కు పంజాబ్ సమస్యలపై ఏమాత్రం చిత్తశుద్ది లేదని హర్సిమ్రత్ విమర్శించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications