జైల్లో శశికళ చీరలు ఇవే: అదే దర్బారుతో ఉన్నారంటున్న భర్త!
బెంగళూరు సెంట్రల్ జైల్లో శశికళ జైల్లో ఎరుపు రంగు చీరలు, తెల్ల రంగు చీరలు కట్టుకుంటున్నారని, ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని ఆమెతో మాట్లాడిన తరువాత శశికళ భర్త నటరాజన్ తన సన్నిహితులతో ఈ విషయం చెప్పారని తెలిసిం
బెంగళూరు: ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ సాదారణ ఖైదీగా జీవితం గడపడం లేదని తాజాగా వెలుగు చూసింది.
ఖైదీలు కట్టుకునే చీరలు కాకుండా శశికళ మామూలు చీరలు కట్టుకున్నారని విశ్వసనీయ సమాచారం. శశికళ జైల్లో ఎరుపు రంగు చీరలు, తెల్ల రంగు చీరలు కట్టుకుంటున్నారని తెలిసింది. శశికళ భర్త నటరాజన్ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు చేరుకుని శశికళతో మాట్లాడారు.

తరువాత ఆయన తన సన్నిహితులతో శశికళ జైల్లో ఎరుపు, తెలుపు రంగు చీరలు కట్టుకుంటున్నారని, ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారని తెలిసింది. బెంగళూరు సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించే ఖైదీలు అక్కడి సిబ్బంది ఇచ్చే చీరలు కట్టుకోవాలి.
అయితే శశికళకు అందుకు మినహాయింపు ఇచ్చారని సమాచారం. ఈ విషయంపై జైలు అధికారులు స్పందిస్తూ అందరు ఖైదీలు కట్టుకునే చీరలే శశికళ కట్టుకుంటున్నారని, ఆమెకు ప్రత్యేక సదుపాయాలు ఏమీ కల్పించడం లేదని అంటున్నారు. అయితే పరప్పన అగ్రహార జైలులో డబ్బులు ఇస్తే ఎలాగైనా చలాయించవచ్చు అనే విషయం గతంలోనే అనేక సార్లు అధికారుల విచారణలో వెలుగుచూసింది.












Click it and Unblock the Notifications