వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీస్తా సెలత్వాడ్ అరెస్ట్.. అహ్మదాబాద్‌కు తరలింపు.. కారణమిదే..?

|
Google Oneindia TeluguNews

తీస్తా సెతల్వాడ్‌ను యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. ముంబైలోని ఆమె నివాసంలో శనివారం అదుపులోకి తీసుకుంది. ప్రత్యేక వాహనంలో అహ్మదాబాద్‌కు తరలించారు. ఏటీఎస్ బృందం సెతల్వాడ్ ఇంట్లోకి మధ్యాహ్నం దూసుకొచ్చి అదుపులోకి తీసుకున్నారని ఆమె తరఫు న్యాయవాది ఆరోపించారు.

2002 గుజరాత్ అల్లర్లలో ధ్వంసమైన గుల్బర్గా సొసైటీ బాధితుల స్మారకార్ధం మ్యూజియం ఏర్పాటు చేస్తానని నిధులను సేకరించిన సంగతి తెలిసిందే. అయితే వాటిని తీస్తా సెతల్వాడ్ సొంత అవసరాలకు వాడుకున్నారనే అభియోగాలు వచచాయి. దీనిపై గతంలో ఓ కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం దర్యాపు కూడా దాంతో ముడిపడి ఉందని అంటున్నారు.

Activist Teesta Setalvad arrested by Gujarat ATS

గుజరాత్ అల్లర్లపై తీస్తా సెతల్వాడ్ కు చెందిన స్వచ్ఛంద సంస్థ పోలీసులకు ఆనాడు నిరాధారమైన సమాచారాన్ని అందించిందని నిన్న హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. గుజరాత్ అల్లర్ల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇచ్చిన క్లీన్ చిట్‌ను సమర్ధిస్తూ సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

తీస్తా, మరో ఇద్దరు మాజీ ఐపీఎస్ అధికారులు గుజరాత్ అల్లర్ల గురించి తప్పుడు సమచారం ఇచ్చారని పోలీసులు పేర్కొన్నారు. తీస్తాతోపాటు అధికారులు సంజీవ్ భట్, ఆర్బీ శ్రీకుమార్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. జకియా జఫ్రీ నేతృత్వంలో కోర్టుకు తీస్తా తప్పుడు సమాచారం ఇచ్చారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. వీరిపై 468, 471, 194 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గుజరాత్ అల్లర్లకు సంబంధించి ప్రధాని మోడీ సహా 64 మంది సుప్రీంకోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. వారికి ఏ సంబంధం లేదని తెలిపింది. ఆ క్రమంలో తీస్తా అరెస్ట్ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమె తప్పుడు సమాచారం అందజేశారని అధికార పార్టీ ఆరోపించింది. ఆ మేరకు అధికారులు అరెస్ట్ చేశారు.

English summary
Gujarat anti-terror squad team on Saturday arrested activist Teesta Setalvad. She is being taken to Ahmedabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X