అనూహ్య నిర్ణయం: రాజ్యసభ సభ్యత్వానికి మిథున్‌ రాజీనామా

అనారోగ్య కారణాల వల్లే తాను రాజీనామా చేస్తున్నట్టు మిథున్ చక్రవర్తి పేర్కొనట్టుగా సమాచారం.

న్యూఢిల్లీ: ఒకప్పటి బాలీవుడ్ స్టార్, రాజ్యసభ ఎంపీ మిథున్ చక్రవర్తి అనూహ్యంగా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. అనారోగ్య కారణాల వల్లే తాను రాజీనామా చేస్తున్నానని పేర్కొనట్టుగా తెలిపారు.

మిథున్ చక్రవర్తి రాజీనామాను టీఎంసీ నేత డెరెక్‌ ఒబ్రెయిన్‌ ధ్రువీకరించారు. సభ్యత్వానికి రాజీనామా చేసినా.. పార్టీ ఆయనతో సత్సంబంధాలు కొనసాగిస్తుందని ఒబ్రెయిన్ తెలిపారు. అనారోగ్యం నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టుగా పేర్కొన్నారు.

Actor Mithun Chakraborty resigns from Rajya Sabha

కాగా, 2014 ఏప్రిల్ నెలలో పశ్చిమ బంగాల్ లోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున మిథున్ చక్రవర్తి రాజ్యసభకు ఎంపికయ్యారు. అయితే రెండున్నరేళ్ల కాలంలో ఆయన కేవలం మూడుసార్లు మాత్రమే రాజ్యసభకు హాజరవడం పట్ల విమర్శలు ఎదుర్కొన్నారు.

ఇదిలా ఉంటే ఒకప్పుడు డిస్కో డ్యాన్సర్ గా బాలీవుడ్ ను మిథున్ చక్రవర్తి ఒక ఊపు ఊపారు. తెలుగులో ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ 'గోపాలగోపాల' చిత్రంలో మిథున్ చక్రవర్తి విలన్‌గా నటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+