Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నటి తడితడి అందాలు: తుఫాన్‌లో..అర్ధనగ్నంగా: నేలకూలిన చెట్ల వద్ద హాట్ హాట్‌ ఫొటోషూట్

ముంబై: తౌక్టే తుఫాన్ అయిదు రాష్ట్రాల్లో విధ్వంసాన్ని సృష్టించింది. కేరళ నుంచి గుజరాత్ దాకా భయకంపితులను చేసింది. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌లకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గుజరాత్ వద్ద తీరాన్ని దాటిన ఈ తుఫాన్ వల్ల ఈ అయిదు రాష్ట్రాల్లో పలువురు మృత్యువాత పడ్డారు. పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. తీరప్రాంత వాసులు నిరాశ్రయులయ్యారు. తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో 190 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. జాతీయ, రాష్ట్రీయ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ బలగాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.

టీవీ నటి పైత్యం..

ఈ పరిస్థితుల్లో.. ఓ టెలివిజన్ నటి తన పైత్యాన్ని ప్రదర్శించారు. భారీ తుఫాన్‌లోనూ ఫొటో షూట్‌కు దిగారు. ఈదురుగాలుల వల్ల నేలకూలిన చెట్ల వద్ద తడిచిన అందాల్లో ఫొటో షూట్‌కు ఫోజులిచ్చారు. ఓ పాటకు మైమరిచి డాన్స్ చేశారు. ఒక భారీ వర్షం కురుస్తున్నప్పటికీ.. దాన్ని లెక్కచేయలేదు. వర్షాన్ని ఆస్వాదించారు. తడితడి అందాలను మత్తెక్కించారు. అక్కడిదాకా బాగానే ఉన్నప్పటికీ- నేలకూలిన చెట్ల వద్ద ఫొటో షూట్‌కు దిగడం విమర్శలకు దారి తీస్తోంది. వందలాదిమందిని నిరాశ్రయులు చేసిన తుఫాన్ సమయంలో అలా గంతులు వేయడం పట్ల నెటిజన్లు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోన్నారు. ఆమెపై ఫైర్ అవుతున్నారు.

నేలకూలిన చెట్ల వద్ద

ఆ నటి పేరు దీపికా సింగ్. టీవీ సీరియళ్లలో నటిస్తుంటారామె. దియా ఔర్ బాతీ హమ్‌తో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఈ సీరియల్‌లో సంధ్య పాత్రలో నటిస్తున్నారు. తౌక్టే తుఫాన్ ప్రభావంతో ముంబైలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. పలు చెట్లు నేలకూలాయి. చెట్లు మీద పడటం వల్ల పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. కొందరు గాయపడ్డారు కూడా. అలాంటి సమయంలో.. నేలకూలిన చెట్ల వద్ద ఫొటో షూట్ చేశారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, ఓ వీడియో క్లిప్‌ను ఆమె తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దానికి Cyclone Tauktae photoshoot అనే ట్యాగ్‌లైన్ జోడించారు.

నెటిజన్స్ ఫైర్..

నెటిజన్స్ ఫైర్..

అలా పోస్ట్ చేయంగానే.. అవి వైరల్‌గా మారాయి. దీపికా సింగ్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఒకవంక జనం ఛస్తోంటే.. నువ్వు ఎంజాయ్ చేస్తోన్నావా.. వాట్ ఎ షేమ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో ఇలాంటి చర్యలకు దిగడం సిగ్గుగా అనిపించట్లేదా? అని నిలదీస్తున్నారు. ఆమెను విమర్శిస్తూ చేస్తోన్న కామెంట్లతో ఇన్‌స్టా తడిచి ముద్దయింది. సోషల్ మీడియాలో వ్యక్తమౌతోన్న విమర్శలకు ఆమె సమాధానం ఇచ్చారు. తన ఇంటి ఎదురుగా నేలకూలిన చెట్ల వద్దే తాను ఫొటోషూట్ చేశానని దీపికా సింగ్ వివరణ ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+