Actress: టాప్ హీరోయిన్ అర్దనగ్న ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసిన మేకప్ మేన్ !
బెంగళూరు: ప్రముఖ హీరోతో కలిసి హీరోయిన్ గా నటించి రాత్రికి రాత్రే స్టార్ అయిన నటి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నది. చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఆమె లైవ్ స్ట్రీమింగ్ యాప్ లో, ట్యాంగో యాప్ లో కొన్ని అర్దనగ్న వీడియోలు, ఫోటోలు తీసి విడుదల చేసింది. హీరోయిన్ కు ఓ యువకుడు మేకప్ మేన్ ఉన్నాడు. ఇటీవల హీరోయిన్ కు వాట్సాప్ లో కొన్ని ఫోటోలు, వీడియోలు షేర్ అయ్యాయి. మాకు రూ. 30 లక్షలు ఇవ్వకుంటే నీ అర్డనగ్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని, తరువాత నీకు సినిమాల్లో చాన్స్ లు రావని బ్లాక్ మెయిల్ చేశారు. అర్దనగ్నంగా ఉన్న వీడియోలు, ఫోటోలు చూసి బిత్తరపోయిన హీరోయిన్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఆ హీరోయిన్ మేకప్ మేన్ ను అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. హీరోయిన్ దగ్గర మేకప్ మేన్ గా పని చేస్తున్న యువకుడు ఆ హీరోయిన్ కు బంధువు కావడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే హీరోయిన్ మొబైల్ ఫోన్ లో ఆమె అర్డనగ్న వీడియోలు, ఫోటోలు మేకప్ మేన్ ఎలా తీసుకున్నాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

కన్నడలో టాప్ హీరోతో చాన్స్
కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న నటి మంచి పేరు సంపాధించుకోవాలని ప్రయత్నాలు చేసింది. ప్రముఖ టాప్ హీరోతో ఆమెకు హీరోయిన్ గా నటించే చాన్స్ వచ్చింది. ప్రముఖ హీరోతో కలిసి హీరోయిన్ గా నటించి రాత్రికి రాత్రే స్టార్ అయిన ఆ నటి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నది.

అలాంటి వీడియోలు, ఫోటోలు మొబైల్ లో తీసుకున్న హీరోయిన్ ?
ప్రముఖ హీరోతోపాటు అనేక మంది హీరోలతో కలసి ఆమె నటిస్తోంది. కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఆమె లైవ్ స్ట్రీమింగ్ యాప్ లో, ట్యాంగో యాప్ లో కొన్ని పర్సనల్ వీడియోలు, ఫోటోలు తీసి సాటి నటీనటులతో షేర్ చేసుకుంది. అయితే ఆమె గ్రూప్ లో ఉన్న వాళ్లు, ఆమెకు సబస్క్రైబర్స్ గా ఉన్న వాళ్లు మాత్రమే ఆ వీడియోలు, ఫోటోలు చూడటానికి అవకాశం ఉంది.

రూ. 30 లక్షలు డిమాండ్
ఇటీవల హీరోయిన్ కు వాట్సాప్ లో కొన్ని ఫోటోలు, వీడియోలు షేర్ అయ్యాయి. మాకు రూ. 30 లక్షలు ఇవ్వకుంటే నీ అర్డనగ్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని, తరువాత నీకు సినిమాల్లో చాన్స్ లు రావని బ్లాక్ మెయిల్ చేశారు. అర్దనగ్నంగా ఉన్న వీడియోలు, ఫోటోలు చూసి బిత్తరపోయిన హీరోయిన్ బెంగళూరు పోలీసులను ఆశ్రయించింది.

హీరోయిన్ కు మేకప్ మేన్
హీరోయిన్ కు బెంగళూరు నగరంలోని భువనేశ్వరినగర్ లో నివాసం ఉంటున్న మహంతేశ (37) అనే వ్యక్తి మేకప్ మేన్ గా పని చేస్తున్నాడు. హీరోయిన్ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ ఎవరెవరు చూశారు ? అని పోలీసులు ఆరా తీశారు. హీరోయిన్ ఉపయోగించే వ్యక్తిగత మొబైల్ ఫోన్ లోని వీడియోలు, ఫోటోలు ఎలా లీక్ అయ్యాయి ? అని పోలీసులు ఆరా తీశారు.

బంధువే ఇంతపని చేశాడా ?
హీరోయిన్ కు మేకప్ మేన్ గా పని చేస్తున్న మహంతేశ ఆమెకు సమీప బందువు అని పోలీసుల విచారణలో వెలుగు చూసిందది. మేకప్ వేసుకునే సమయంలో హీరోయిన్ ఆమె ఫోన్ మేకప్ మేన్ మహంతేశ దగ్గరకు ఇచ్చిందని, ఆ సందర్బంలో ఆమె మొబైల్ ఫోన్ లో ఆమె అర్డనగ్న వీడియోలు, ఫోటోలను అతనే సీక్రేట్ గా ఆతని మొబైల్ ఫోన్ కు పంపించుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

డబ్బు కోసం ఎంతకు తెగించాడు ?
హీరోయిన్ కు సమీప బంధువు కావడం, ఆమెకు మేకప్ మేన్ గా పని చేస్తున్న మహంతేశకు ఆమె వ్యక్తిగత విషయాలు చాలా తెలుసని, ఆమెను బ్లాక్ మెయిల్ చేసి రూ. 30 లక్షలు లాక్కోవాలని మహంతేశ స్కెచ్ వేశాడని పోలీసులు చెప్పారు. హీరోయిన్ మేకప్ మేన్ ను అరెస్టు చేసి అతను ఇంకా ఎంతమందిని ఇలా మోసం చేశాడు ? అని ఆరా తీస్తున్నామని బెంగళూరు పోలీసులు తెాలిపారు. హీరోయిన్ ను ఆమె మేకప్ మేన్ బ్లాక్ మెయిల్ చేశాడని వెలుగు చూడటం స్యాండిల్ వుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications