Actress: హీరో అర్జున్ సర్జా మీద లైంగిక దౌర్జన్యం కేసు పెట్టిన నటి, బి రిపోర్డు సమర్పించిన పోలీసులు !
బెంగళూరు: ప్రముఖ హీరో, దర్శకుడు, నిర్మాత మీద వచ్చిన లైంగిక దాడి ఆరోపణల కేసులో పోలీసులు కోర్టుకు బి రిపోర్టు సమర్పించారు. షూటింగ్ సమయంలో ప్రముఖ హీరో తన మీద లైంగిక దౌర్జాన్యానికి పాల్పడ్డాడని ప్రముఖ హీరోయిన్ పోలీసు కేసు పెట్టింది. పలుబాషల్లో హీరోగా నటించిన ఆ నటుడి మీద లైంగిక దౌర్జన్యం కేసు నమోదు కావడం కలకలం రేపింది. సుమారు మూడు సంవత్సరాలకు పైగా కేసు విచారణ చేసిన పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోతో పాటు మరో కొందరిని, కేసు పెట్టిన నటిని విచారణ చేసి వివరాలు సేకరించారు. ఇంతకాలం కేసు విచారణ చేసిన పోలీసు అధికారులు కోర్టులో బి రిపోర్టు సమర్పించారు. పోలీసులు సమర్పించిన బి రిపోర్టుపై మీకు అభ్యంతరాలు ఏమైనా ఉంటే కోర్టు ముందు హాజరుకావాలని కోర్టు ఆ నటికి నోటీసులు జారీ చేసింది. కోర్టు నోటీసులు జారీ చేసినా ఆ నటి కోర్టు ముందు హాజరుకాకపోవడంతో ప్రముఖ హీరో అర్జున్ సర్జా మీద వచ్చిన లైంగిక దౌర్జన్యం కేసు విచారణకు పుల్ స్టాప్ పడింది.

ప్రముఖ హీరో అర్జున్ సర్జా
ప్రముఖ హీరో, దర్శకుడు, నిర్మాత అర్జున్ సర్జా తమిళ, తెలుగు, కన్నడ, మళయాలం, హిందీ సినిమాల్లో నటించిన విషయం తెలిసింది. అర్జున్ సర్జా హీరోగానే కాకుండా ఆయన దర్శకత్వంలో ఆయనే హీరోగా నటించిన అనేక సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కాయి. ఇప్పుడు అర్జున్ సర్జా క్యారెక్టర్ ఆర్టిస్టుగాను నటిస్తున్న విషయం తెలిసిందే.

లైంగిక దౌర్జన్యం కేసు పెట్టిన ప్రముఖ నటి
2018లో కన్నడలో తెరకెక్కిన విస్మయ అనే సినిమా షూటింగ్ జరిగింది. విస్మయ సినిమా షూటింగ్ సమయంలో తన మీద హీరో అర్జున్ సర్జా లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డారని ప్రముఖ నటి శృతి హరిహరన్ బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ప్రముఖ నటి శృతి హరిహరన్ కేసు పెట్టడంతో అప్పట్లో ప్రముఖ హీరో అర్జున్ సర్జా మీద కేసు నమోదు అయ్యింది.

హీరో అర్జున్ సర్జా, నటి విచారణ
ప్రముఖ హీరో అర్జున్ సర్జా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు విచారణ చేశారు. పలుబాషల్లో హీరోగా నటించిన హీరో అర్జున్ సర్జా మీద లైంగిక దౌర్జన్యం కేసు నమోదు కావడం అప్పట్లో కలకలం రేపింది. సుమారు మూడు సంవత్సరాలకు పైగా కేసు విచారణ చేసిన పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో అర్జున్ తో పాటు మరో కొందరిని, కేసు పెట్టిన నటి శృతి హరిహరన్ ను విచారణ చేసి వివరాలు సేకరించారు.

ఎలాంటి సాక్షాలు లేవని కోర్టులో బి రిపోర్డు
ఇంతకాలం కేసు విచారణ చేసిన పోలీసు అధికారులు కోర్టులో బి రిపోర్టు సమర్పించారు. నటుడు అర్జున్ సర్జా నటి శృతి హరిహరన్ మీద లౌంగిక దౌర్జన్యానికి పాల్పడ్డాడని ఎలాంటి సాక్షాలు చిక్కడం లేదని, ఇంతకాలం ఆ విషయంలో మేము విచారణ చేసి వివరాలు సేకరించినా అర్జున్ సర్జాకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాలు చిక్కలేదని కబ్బన్ పార్క్ పోలీసులు బెంగళూరు 8వ ఏసీఎంఎం కోర్టులో బి రిపోర్డు సమర్పించారు.

కోర్టుకు హాజరుకాని నటి
కోర్టు అర్జున్ సర్జా కేసులో కబ్బన్ పార్క్ పోలీసులు సమర్పించిన బి రిపోర్డులను పరిశీలించింది. పోలీసులు సమర్పించిన బి రిపోర్టుపై మీకు అభ్యంతరాలు ఏమైనా ఉంటే కోర్టు ముందు హాజరుకావాలని 8వ ఏసీఎంఎం కోర్టు నటి శృతి హరిహరన్ కు నోటీసులు జారీ చేసింది. కోర్టు నోటీసులు జారీ చేసినా నటి శృతి హరిహరన్ కోర్టు ముందు హాజరుకాకపోవడంతో ప్రముఖ హీరో అర్జున్ సర్జా మీద వచ్చిన లైంగిక దౌర్జన్యం కేసు విచారణకు పుల్ స్టాప్ పడింది. పోలీసుల సమర్పించిన అర్జున్ సర్జా కేసులోని బి రిపోర్డు అమోదించడానికి కోర్టు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications