సూపర్ స్టార్ సునామి, ఐటీ హబ్ లో ఫస్ట్ రోజు జైలర్ ఎన్ని వేల షోలు అంటే, కేజీఎఫ్ కు!
బెంగళూరు/చెన్నై: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఇదే నెల 10వ తేదీన పాన్ ఇండియా రేంజ్ లో జైలర్ సినిమా విడుదల అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాకు సంచలన దర్శకుడు నెల్సన్ కుమార్ దర్శకత్వం వహించడంతో ఆ సినిమా మీద అంచనాలు తారాస్థాయికి చేరాయి.
గతంలో నెల్సన్ దర్శకత్వం వహించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. రజనీకాంత్, నెల్సన్ కాంబినేషన్ లో సినిమా అని ప్రకటించిన రోజే రజనీకాంత్ అభిమానులు పండుగ చేసుకున్నారు. ఇక సినిమా గురించి అప్పటి నుంచే ఎవరికి ఊహించినట్లు వాళ్లు ఊహించుకుంటున్నారు. ఇటీవల విడుదలైన జైలర్ సినిమా ట్రైలర్ తో అందరి అంచనాలు ఇంకా ఎక్కువ అయ్యాయి.

రెండు నిమిషాల 15 సెకన్లు ఉన్న జైలర్ సినిమా ట్రైలర్ చూసిన సినీ అభిమానులు ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని అప్పుడు స్టేట్ మెంట్లు ఇచ్చేశారు. తమిళంలో తెరకెక్కిన జైలర్ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదల అవుతున్నది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా రజనీకాంత్ సినిమాలకు మాంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే.
రజనీకాంత్ జైలర్ సినిమా తమిళ్, తెలుగు, కన్నడ, మళయాలం, హిందీ బాషల్లో ఇదే నెల 10వ తేదీన దేశ, విదేశాల్లో విడుదల అవుతున్నది. ఐటీ హబ్ బెంగళూరులో కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ మళయాలం సినిమాలు విడుదల అవుతాయి. ఇప్పుడు రజనీకాంత్ జైలర్ సినిమా తమిళ్ తో పాటు కన్నడ, తెలుగు, హిందీ బాషాల్లో బెంగళూరులో విడుదల అవుతోంది.
గతంలో కేజీఎఫ్ చాప్టర్-2 సినిమా బెంగళూరులో మాత్రమే మొదటి రోజు 1, 034 షోలు ప్రదర్శించి రికార్డుగా నిలిచింది. అయితే రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా ఆగస్టు 10వ తేదీన బెంగళూరు నగరంలో ఏకంగా 1, 100 షోలకు పైగా ప్రదర్శించడానికి అడ్వాన్స్ బుకింగ్ కు తెర లేపడంతో కేజీఎఫ్ చాప్టర్ -2 సినిమా రికార్డులను బద్దలు కొట్టింది.

ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ మొదలు కావడంతో రజనీకాంత్ సినిమా సునామి మొదలైయ్యింది. బెంగళూరు నగరంలో ఎక్కువగా తమిళ్ వెర్షన్ సినిమా ప్రదర్శకు థియేటర్ యాజమాన్యం ఆసక్తి చూపించింది. తరువాత జైలర్ తెలుగు వర్షన్ ఎక్కువ షోలు వేస్తున్నారు.
కన్నడ జైలర్ వర్షన్ మాత్రం మంగళవారం సాయంత్రం వరకు 16 షోలకు మాత్రమే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించారు. మొత్తం మీద 10వ తేదీన బెంగళూరులో ఒక్కరోజు మాత్రమే జైలర్ సినిమా 1, 100పైగా షోలు ప్రదర్శించడానికి రంగం సిద్దం కావడంతో రజనీకాంత్ అభిమానులు మంచి ఊపుమీద ఉన్నారు. జైలర్ సినిమా విడుదల విషయంలో కన్నడ వర్షన్ ఎక్కువ థియేటర్లలో విడుదల చెయ్యకపోవడంతో కన్నడ సినీ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications