Omicron టెన్షన్: ఫిష్ మార్కెట్‌గా ఢిల్లీ ఎయిర్ పోర్టు, వీడియో వైరల్.. స్పందించిన సిందియా
ఒమిక్రాన్ వేరియంట్ అంటేనే భయాందోళన వ్యక్తమవుతోంది. బెంగళూరులో 2, ఢిల్లీలో ఒకరు, గుజరాత్ జామ్ నగర్, మహారాష్ట్రలో ఒకరికి చొప్పున కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నిన్న మహారాష్ట్రలో 7, రాజస్తాన్‌లో 9 కేసులతో ఆ సంఖ్య 21కి చేరింది. ఇటు ఢిల్లీ ఎయిర్ పోర్టు వద్ద జనం రద్దీ కొనసాగుతోంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. పండుగ సీజన్ లో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌ను తలపించేలా ప్రయాణికులతో ఢిల్లీ ఎయిర్ పోర్టు నిండుగా కనిపించింది.
కరోనా టెస్టులు చేయించుకునేవారు, టెస్టులు చేయించుకుని ఫలితాల కోసం వేచిచూసేవారితో ఢిల్లీ ఎయిర్ పోర్టు తిరునాళ్ల మాదిరిగా మారింది. దీనిపై ఫిర్యాదులు కూడా వస్తుండడంతో కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా స్పందించారు. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు, ఢిల్లీ ఎయిర్ పోర్టు నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న డీఐఏఎల్ సంస్థ ప్రతినిధులతోనూ సమావేశం నిర్వహించారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో పరిస్థితులపై చర్చించారు.

ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ డీఐఏఎల్ సంస్థకు కేంద్రమంత్రి సిందియా స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తికి అవకాశం ఉన్న నేపథ్యంలో.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎయిర్ పోర్టులో కరోనా పరీక్షల పేరుతో ఇలా జనం రద్దీ కొనసాగుతోంది. అయితే జన సమూహాలతో కరోనా వ్యాప్తి ఇంకా అధికం అవుతుందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
Recommended Video
ఇటు ఒమిక్రాన్ డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తుంది. తీవ్ర ఒళ్ళు నొప్పులు, నీరసం, తలనొప్పి వంటి లక్షణాలు ఓమిక్రాన్ సోకిన వారికి ఉంటాయి. కానీ టిమ్స్ లో చేరిన అనుమానిత కేసుల్లో ఎవరికీ లక్షణాలు లేవు. టిమ్స్‌లో లండన్ నుంచి వచ్చిన యువతి చేరిందనే అనుమానం కలుగుతుంది. కానీ లండన్ నుంచి వచ్చిన యువతి తనకు అవమానం జరిగిందని వాపోయారు. దేశంలో వచ్చిన కేసులు టెన్సన్ పుట్టిస్తున్నాయి. వారి నుంచి వేరియంట్ వ్యాప్తి చెందకుంటే సంతోషం.. లేదంటే మరోసారి హడలెత్తించాల్సిన పరిస్థితి వస్తోంది.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications