చైనా వ్యూహాలకు ధీటుగా భారత్ పావులు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: డొక్లాం ఇష్యూ అనంతరం భారత్... చైనా వ్యూహాలకు చెక్ చెప్పేలా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది.

భారత్-బ్రహ్మపుత్రపై భారీ కుట్ర: అంతా అబద్దం.. చైనా స్పందన

అవసరమైనపుడు అత్యంత వేగంగా సేనలను మోహరించేందుకు సిద్ధంగా ఉండాలని ప్రయత్నిస్తోంది. డొక్లాం వద్ద చైనా సృష్టించిన అలజడి నేపథ్యంలో భారత ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయాలను తీసుకుంటోంది.

ఏడాది పొడవునా సైన్యం మోహరించడం కష్టం కాబట్టి

ఏడాది పొడవునా సైన్యం మోహరించడం కష్టం కాబట్టి

చైనా సరిహద్దుల్లోని తూర్పు లడక్ ప్రాంతంలో మరిన్ని వాయుసేన స్థావరాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. లడక్‌లో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. ఏడాది పొడవునా సైన్యాన్ని మోహరించడం సాధ్యం కాదు. సైన్యం ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించడం చాలా కష్టం.

అందుకే వైమానిక స్థావరాలు

అందుకే వైమానిక స్థావరాలు

అందువల్ల వైమానిక స్థావరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విమానాల్లో ఎక్కువ మంది సైనికులను పంపించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

న్యోమా వైమానిక స్థావరం

న్యోమా వైమానిక స్థావరం

న్యోమా వైమానిక స్థావరాన్ని పునరుద్ధరించాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా కాలంగా కోరుతోంది. సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ స్థావరం అన్ని రకాల రవాణా విమానాలను పూర్తి స్థాయిలో నిర్వహించే విధంగా అభివృద్ధి చేయాలని కోరుతోంది.

1962లో చివరిసారి ఉపయోగించారు

1962లో చివరిసారి ఉపయోగించారు

చైనా సరిహద్దుల్లో, తూర్పు లడక్‌కు సమీపంలో ఈ విమానాశ్రయం ఉంది. దీనిని 1962లో చైనాతో యుద్ధం సమయంలో చివరిసారి ఉపయోగించారు. 2009లో పునరుద్ధరణ పనులు జరిగాయి.

అరుణాచల్ ప్రదేశ్‌లో అభివృద్ధి చేస్తున్నారు

అరుణాచల్ ప్రదేశ్‌లో అభివృద్ధి చేస్తున్నారు

చూసుల్ వద్ద మరో వైమానిక స్థావరాన్ని అభివృద్ధి చేసేందుకు పరిశీలించినప్పటికీ, ఆ ప్రయత్నాలు ఆచరణ సాధ్యం కాదని తెలుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లో ఏడు అడ్వాన్స్‌డ్ ల్యాండింగ్ గ్రౌండ్స్ ఉన్నాయి. వీటన్నిటినీ ప్రస్తుతం అభివృద్ధిపరుస్తున్నారు. వీటిలో కొన్నిటిని ఇప్పటికే ఉపయోగించుకోవడానికి అనుకూలంగా మార్చారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After Doklam crisis, India plans to develop more airfields along China border in Ladakh

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి