సోనియా గాంధీకి ఝలక్, మోదీకి జేడీఎస్ జై, ఎన్ డీఏతో దోస్తి, ఇక దబిడి దబిడే, లోక్ సభలో!

బెంగళూరు/న్యూఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జేడీఎస్ (jds) ఇప్పుడు అధికారికంగా బీజేపీతో (bjp) పొత్తు పెట్టుకుంది. ఎన్ డీఏ కూటమిలో చేరుతున్న సందర్బంగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా జేడీఎస్ పార్టీని ఎన్ డీఏ కూటమిలోకి స్వాగతించారు. శుక్రవారం న్యూఢిల్లీలో బీజేపీ (bjp) హైకమాండ్ తో జేడీఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చర్చలు జరిపారు. ఇంతకు ముందే ప్రధాని (pm) మోదీ (modi), మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ చర్చలు జరిపారు.

జేడీఎస్‌ సీనియర్‌ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి శుక్రవారం కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌ షా (amit shah), బీజేపీ (bjp) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైన తర్వాత జేడీఎస్ పార్టీ ఎన్ డీఏలో భాగస్వామయ్యం అయ్యిందని అధికారిక ప్రకటన వెలువడించారు. బీజేపీ (bjp) హైకమాండ్ తో జేడీఎస్ నాయకులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

JDS party officially joined the NDA

జేపీ నడ్డా (JP) దీని గురించి ట్విట్టర్ ( X) లో పోస్ట్ చేశారు, జేడీఎస్ ( JDS) నాయకులతో ఒక ఫోటోను పంచుకున్నారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో భాగస్వామ్యానికి జేడీఎస్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. జేడీఎస్ ను ఎన్ డీఏలోకి మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని జేపీ నడ్డా తెలిపారు. జేడీఎస్ చేరికతో ఎన్‌డిఎను మరింత బలోపేతం చేస్తుందని, భారత్ కోసం ప్రధాని (pm) నరేంద్ర మోడీ (modi) చేస్తున్న పనులను మరింత బలోపేతం చేస్తుందని జేపీ నడ్డా ట్వీట్ చేశారు.

ఢిల్లీలో (delhi) కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నాయకుడు హెచ్‌డీ కుమారస్వామి మాట్లాడుతూ బీజేపీతో (bjp)చేతులు కలపడంపై అధికారికంగా చర్చ జరిగింది. ప్రాథమిక అంశాలపై చర్చించామని, రానున్న రోజుల్లో పూర్తి సమాచారం వెల్లడిస్తామని, తాము బీజేపీ (bjp) ముందు ఎలాంటి డిమాండ్ చేయలేని వివరించారు.

Sonia Gandhi

జేడీఎస్ ఎన్డీఏ కూటమిలో చేరడంపై కర్ణాటక బీజేపీ (bjp) ట్వీట్ చేసి జేడీఎస్‌కు ఘన స్వాగతం పలికింది. ప్రధాని నరేంద్ర మోదీ సమర్ధవంతమైన నాయకత్వానికి మరియు అభివృద్ధి ఆధారిత రాజకీయాలను మెచ్చి (NDA) కూటమిలో భాగమైనందుకు జేడీఎస్ పార్టీకి హృదయపూర్వక స్వాగతం మరియు అభినందనలు అని ట్వీట్ చేసింది.

దీంతో ఎన్ డీఏ కూటమి బలం పెరిగి ప్రధాని (pm) నరేంద్ర మోదీ (modi)కలలు కన్న నవ భారతాన్ని సాకారం చేసేందుకు మరింత బలం చేకూరనుంది కర్ణాటక బీజేపీ (bjp) ట్వీట్‌లో పేర్కొంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీతో కలిసి జేడీఎస్ పోటీ చెయ్యడానికి ఇప్పటి నుంచే రంగం సిద్దం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+