PayTM LayOffs: పేటీఎం ఉద్యోగులకు AI షాక్- ఏకంగా వెయ్యి మంది ఇంటికి..?
ప్రముఖ షాపింగ్, నగదు చెల్లింపుల యాప్ పేటీఎం తమ ఉద్యోగులకు కొత్త ఏడాది ఆరంభం కానున్న వేళ షాకిచ్చింది. తమ సంస్ధలో తాజాగా కృత్రిమ మేథను అమలు చేయడం మొదలుపెట్టిన పేటీఎం ఇందులో భాగంగా వెయ్యి మందికి పైగా ఉద్యోగులకు లే ఆఫ్ లు ఇచ్చేసినట్లు తెలుస్తోంది. దీంతో మిగతా ఉద్యోగుల్లోనూ కలవరం మొదలైంది. కృత్రిమ మేథ వాడకం కారణంగా ఉద్యోగులకు లేఆఫ్ లు ఇస్తున్న సంస్ధల జాబితాలో పేటీఎం కూడా చేరడంతో ఇండస్ట్రీలోనూ కలకలం రేగుతోంది.

డిజిటల్ చెల్లింపుల సంస్థ Paytm మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కొత్త ఏడాదిలో తమ ఉద్యోగులపై పెడుతున్న ఖర్చును తగ్గించేందుకు ప్రయత్నాలు ఆరంభించింది. ఈ నేపథ్యంలో పలు కలిపి కనీసం వెయ్యిమంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీలో లేఆఫ్ లపై వస్తున్న వార్తల్ని సంస్ధ ప్రతినిధులు ధృవీకరించారు. అక్టోబర్‌లోనే తొలగింపు ప్రక్రియను ప్రారంభించినట్లు వారు నిర్ధారించారు. కృత్రిమ మేథ (AI) వాడకం ద్వారా కంపెనీ తన కార్యకలాపాలను మార్చాలని లక్ష్యంగా పెట్టుకుందని సంస్ధ ప్రతినిధులు వెల్లడించారు.
తాము ఏఐ ఆధారిత ఆటోమేషన్‌తో కార్యకలాపాలను మార్చడం, వృద్ధి, ఖర్చుల్లో చేస్తున్న మార్పుల్లో భాగంగా ఈ ఉద్యోగుల తొలగింపులు ఉంటున్నట్లు సంస్ధ వర్గాలు చెప్తున్నాయి. దీని ఫలితంగా ఆపరేషన్స్, మార్కెటింగ్ విభాగాలపై కొంత ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఏఐ పవర్డ్ ఆటోమేషన్‌ను వాడటం ద్వారా కంపెనీ ఉద్యోగులపై పెట్టే ఖర్చులో 10 నుంచి 15 శాతం ఆదా అవుతుందని అంచనా.
కొత్త ఏడాదిలో తమ ప్రధాన చెల్లింపుల వ్యాపారంలో 15 వేల మంది ఉద్యోగుల్ని తీసుకోవాలని కూడా భావిస్తున్నట్లు పేటీఎం సంస్ధ చెబుతోంది. చెల్లింపుల ప్లాట్‌ఫారమ్‌లో ఆధిపత్యం కొనసాగించేందుకు, కొత్త ఆవిష్కరణలకు కూడా చోటు కల్పిస్తున్నట్లు సంస్ధ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగానే తాజా మార్పులు చోటు చేసుకుంటున్నట్లు వెల్లడించింది . పేటీఎం తన BNPL ఆఫర్, Paytm పోస్ట్‌పెయిడ్ కింద రూ. 50,000 వరకు చిన్న-టికెట్ రుణాలపై రీ-స్కేలింగ్ ప్రకటించిన కొద్ది వారాల తర్వాత ఈ ఉద్యోగాల తొలగింపులు చోటు చేసుకున్నాయి. అయితే ఈ మార్పుల వల్ల కంపెనీ షేర్లు 20 శాతం పడిపోయాయి.
-
జీరా వాటర్ Vs మెంతుల నీరు- షుగర్ కంట్రోల్ చేయడానికి ఏది బెస్ట్..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..!












Click it and Unblock the Notifications