రిసార్ట్ లో శశికళ వర్గం ఎమ్మెల్యేలు అర్దనగ్నంగా చిందులు: వైరల్ వీడియో

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాలని ఆశపడిన శశికళ కువత్తూరులోని గోల్డన్ బే రిసార్ట్ కు అన్నాడీఎంకే పార్టీకి చెందిన 122 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లిన విషయం తెలిసిందే. రిసార్ట్ లో ఎమ్మెల్యేలు జల్సాలు చేశారని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి.

శశికల వర్గం ఎమ్మెల్యేలు రిసార్ట్ లో ఏమీ చేశారో అని తనకు మొత్తం తెలుసు, త్వరలో అక్కడ జరిగిన తతంగం మొత్తం వీడియో టేపులు బయటపెడుతానని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గంలోని రాజ్యసభ సభ్యుడు మైత్రేయన్ అన్నారు.

ఇప్పుడు గోల్డన్ బే రిసార్ట్ లో శశికళ వర్గంలోని ఎమ్మెల్యేలు అర్దనగ్నంగా తాగి తందనాలు ఆడిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రిసార్ట్ లో అర్దనగ్నంగా డ్యాన్స్ లు వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ విషయం తెలుసుకున్న మన్నార్ గుడిమా మాఫియా ఆ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నది. అయితే అప్పటికే ఆ వీడియో వైరల్ కావడంతో అర్దనగ్నంగా డ్యాన్స్ లుు వేసిన ఎమ్మెల్యేలు ఆత్మరక్షణలో పడ్డారు.x

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+