ఆరెస్సెస్ ను నిషేధించాల్సిందే..! పటేల్ ను ముందుపెట్టి ఖర్గే డిమాండ్..!

స్వతంత్ర భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సంచలన డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. బీజేపీకి సైద్ధాంతిక మద్దతుదారుగా చెప్పుకునే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్ )ను నిషేధించాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని ఖర్గే ఇవాళ తెలిపారు. గతంలో సర్దార్ పటేల్ సైతం ఆరెస్సెస్ కార్యకలాపాల్గో ఉద్యోగులు పాల్గొనకుండా నిషేధం విధించారని గుర్తుచేశారు.

ఆరెస్సెస్ కార్యకలాపాల్గో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా సర్దార్ పటేల్ విధించిన నిషేధం 2014 వరకూ అమల్లో ఉందని మల్లిఖార్జున్ ఖర్గే తెలిపారు. ఇప్పుడు దాన్ని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరెస్సెస్ భావజాలాన్ని ఆయన విషంతో పోల్చారు. ఓవైపు కాంగ్రెస్ సర్దార్ పటేల్ సేవల్ని దశాబ్దాల పాటు విస్మరించిందంటూ బీజేపీ విమర్శలు చేస్తున్న వేళ ఖర్గే వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

aicc chief Mallikarjun kharge demands rss ban with sardar patel example

ప్రభుత్వ సేవలో ఉన్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేయకూడదని సర్దార్ పటేల్ కూడా అన్నారని ఖర్గే గుర్తుచేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్, జమాతే ఇస్లామీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఆయన నిషేధించారని తెలిపారు. వీటిని మోడీ ప్రభుత్వం 2024 జూలై 9న ఎత్తివేసిందన్నారు. ఈ నిషేధాన్ని తిరిగి తీసుకురావాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు ఖర్గే తెలిపారు. ఖర్గే స్వరాష్ట్రమైన కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీకి సైద్ధాంతిక మాతృ సంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్ ర్యాలీలలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా ఆంక్షలు విధించడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

aicc chief Mallikarjun kharge demands rss ban with sardar patel example

ఈ నేపథ్యంలో ఇవాళ పటేల్ జయంతి రావడంతో ఖర్గే ఆరెస్సెస్ పై స్పందించారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో వల్లభాయ్ పటేల్ ఒక మహోన్నత వ్యక్తి అని, స్వాతంత్య్రం తర్వాత రాచరిక రాష్ట్రాలను భారత ఆధిపత్యంలోకి తీసుకురావడం ద్వారా దేశాన్ని ఏకం చేసిన ఘనత భారతదేశ తొలి హోంమంత్రికి దక్కుతుందన్నారు. ఈరోజు సర్దార్ పటేల్ జయంతిని దేశవ్యాప్తంగా రాష్ట్రీయ ఏక్తా దివస్‌గా జరుపుకుంటారని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+