ఎయిర్ టెల్ అదిరిపోయే ఆఫర్లు
దేశీయ టెలికాం దిగ్గజ సంస్థ ఎయిర్ టెల్ తన వినియోగదారుల కోసం కొత్త పథకాలను అందుబాటులోకి తెచ్చింది. అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ నుంచి 5G డేటా యాక్సెస్, ఉచిత OTT సబ్‌స్క్రిప్షన్ల వరకు ప్రీపెయిడ్ ప్లాన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వంటి OTT ప్లాట్‌ఫామ్‌లను ఉచితంగా చూసే అవకాశాన్ని కొత్త రీఛార్జి ప్లాన్స్ ద్వారా ఎయిర్ టెల్ కల్పిస్తోంది. 15 రకాల ఓటీటీ ఛానెల్స్ ను ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. వీటితోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్, 5జీ డేటా, ఓటీటీ ప్రయోజనాలను అందిస్తోన్న ప్లాన్ల వివరాలు పరిశీలిద్దాం.
రూ. 359 ప్లాన్: అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, నెలరోజుల పాటు ప్రతి రోజు 2జీబీ డేటా, అపోలో 24/7, హలోట్యూన్స్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే వంటి అనేక అదనపు ప్రయోజనాలను పొందొచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే సోనీ లీవ్, ఏరోస్ నౌ, లైన్స్ గేట్‌ప్లేతో పాటు 15 కంటే ఎక్కువ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను చూడొచ్చు. అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 5జీ ఇంటర్నెట్ ను వాడుకోవచ్చు.

రూ. 399 ప్లాన్: 28 రోజుల వ్యాలిడిటీ. అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్, 3జీబీ హై-స్పీడ్ డేటా పొందొచ్చు. అలాగే 15+ ఓటీటీ ఛానెళ్లకు యాక్సెస్‌ను అందించే ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లేకి ఉచిత యాక్సెస్.
రూ. 499 ప్లాన్: 5జీ ఇంటర్నెట్ తోపాటు రూ.399 ప్లాన్ లో ఏయే సౌకర్యాలున్నాయో అవన్నీ ఈ ప్లాన్ లో కూడా ఉన్నాయి. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే యాక్సెస్‌తో పాటు, రీఛార్జ్ ప్లాన్ 3 నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది.
రూ. 699 ప్లాన్: 56 రోజుల వ్యాలిడిటీ. రోజుకు 3 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు.
రూ. 839 ప్లాన్: 84 రోజుల వ్యాలిడిటీ. రోజుకు 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ తోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ లు, 5జీ ఇంటర్నెట్ సౌకర్యం, డిస్నీ+హాట్ స్టార్ తోపాటు మూడు నెలలు అదనపు ప్రయోజనాలు పొందొచ్చు.
రూ. 999 ప్లాన్: 84 రోజులు అన్ లిమిటెడ్ కాలింగ్, 5జీ డేటా, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే యాక్సెస్ తోపాటు వ్యాలిడిటీ అయ్యేంతవరకు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం పొందొచ్చు.
రూ. 3359 ప్లాన్: 365 రోజుల వ్యాలిడిగీ. ప్రతిరోజు 2.5 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, 5జీ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది. ఎయిర్‌టెల్ డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ వార్షిక సబ్‌స్క్రిప్షన్, అపోలో 24/7 మెంబర్‌షిప్‌తో పాటు మరెన్నో అదనపు బెనిఫిట్స్ కూడా పొందొచ్చు.












Click it and Unblock the Notifications