వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్ర ఎన్నికల్లో రికార్డు.. ఆరుసార్లు విజేతగా నిలిచిన సీనియర్ నేత

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ రికార్డు విజయాన్ని నమోదు చేశారు. ఆయన తన రాజకీయ జీవితంలో ఆరోసారి గెలిచి శాసనసభలోకి అడుగుపెట్టనున్నారు. బారామతి నియోజకవర్గంలో ఆయన తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత గోపినాథ్ కుండ్లిక్ పడాల్కపై 1, 65, 265 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికలో ప్రత్యర్థులు డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోవడం గమనార్హం. అజిత్ పవార్‌ను బరాబతిలో మంచి పట్టున్న నేతగా పేరుంది. అయితే ఈసారి బరిలో బీజేపీ రెబల్ అభ్యర్థి ఉండటంతో భారీ మెజారిటీ సాధించే అవకాశం లభించింది.

మహారాష్ట్ర ఎన్నికల సమయంలో ఎదురైన ప్రతికూల పరిస్థితులను అజిత్ పవార్ ధీటుగా ఎదుర్కొన్నారు. ఈడీ విచారణ నేపథ్యంలో ప్రచారంలో ఇబ్బందులెదురైనా వాటిని అధిగమించి గెలుపుబాటలో ప్రయాణించాడు.

Ajit Pawar won six times in Baramati constituency

బారామతి సీటును తన అంకుల్ శరద్ పవార్ కోసం త్యాగి చేసి.. ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ స్థానం నుంచి 1995, 1999, 2004, 2009, 2014 విజయం సాధించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో మరోసారి ఆయన గెలుపును సాధించారు. గతంలో ఆయన వ్యవసాయశాఖ, ఇరిగేషన్, జల వనరులశాఖ మంత్రిగా పనిచేశారు. గత 25 ఏళ్లలో అజిత్ పవార్‌కు బారామతిలో ఇది ఏడో విజయం. ఒకసారి బారామతి లోక్‌సభ నుంచి విజయం సాధించడం తెలిసిందే.

కాగా, తాజా ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించింది. బీజేపీ కూటమి 157 సీట్లలో ఆధిక్యం.. కాంగ్రెస్ కూటమి 104 సీట్లలో, ఇతరులు 27 సీట్లలో ఆధిక్యం కొనసాగుతున్నారు. అయితే బీజేపీ, శివసేన 50-50 శాతం పద్దతిలో అధికారాన్ని పంచుకొనే అవకాశాలున్నాయి. కాగా శివసేన మాత్రం సీఎం పదవిని దక్కించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

English summary
Former Maharashtra deputy chief minister and NCP leader Ajit Pawar on Thursday won from the Baramati assembly seat by a huge margin of 1,65,265 votes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X