Sunetra Pawar: అజిత్ పవార్ భార్యకు ప్రమోషన్..! డిప్యూటీ సీఎంగా..!

మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైన ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ స్ధానంలో ఆయన భార్యకు కీలక బాధ్యతలు అప్పగించాలని మహాయుతి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అజిత్ పవార్ వారసులిగా ఆయన స్ధానంలో డిప్యూటీ సీఎంగా భార్య సునేత్ర పవార్ (sunetra pawar) కు అవకాశం కల్పించాలని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమె రేపు మహారాష్ట్ర కొత్త డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి ఎన్సీపీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఉన్న సునేత్ర పవార్ కు ప్రమోషన్ ఇచ్చి ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. దీంతో రేపు (శనివారం) సాయంత్రం 5 గంటలకు సునేత్రా పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు పగ్గాలు స్వీకరించేందుకు ఆమె అంగీకరించినట్లు తెలుస్తోంది. అలాగే ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఎక్సైజ్, క్రీడా మంత్రిత్వ శాఖల్ని ఆమె నిర్వహించనున్నారు.

ajit pawar s wife sunetra pawar to sworn in as maharastra deputy cm tomorrow

అయితే మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో తాత్కాలికంగా పవార్ నిర్వహించిన ఆర్థిక శాఖను సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన వద్దనే ఉంచుకున్నారు. బడ్జెట్ సమావేశాల తర్వాత ఈ శాఖను ఎన్సీపికి ఇస్తారు. మరోవైపు ఫిబ్రవరి 7న జరగనున్న పూణే జిల్లా పరిషత్ ఎన్నికలకు ముందు పార్టీకి దిశానిర్దేశం చేయడానికి అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌ను ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన తర్వాత పవార్ కుటుంబంలో చర్చలు జరిగాయని, తర్వాత సునేత్రా పవార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+