Ajmer-Sealdah Express: పట్టాలు తప్పిన అజ్మీర్-సీల్దా ఎక్స్‌ప్రెస్..
ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటన రాజస్థాన్ లోని అజ్మీర్ జంక్షన్ వద్ద జరిగింది. అజ్మీర్-సీల్దా ఎక్స్‌ప్రెస్‌లోని నాలుగు కోచ్‌లు ఈ ఉదయం 7.50 గంటలకు మదార్ రైల్వే యార్డ్ వద్ద సేఫ్టీ బ్రేక్‌లను వదులుతున్నప్పుడు బోల్‌ఓవర్ కారణంగా పట్టాలు తప్పినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది. రైల్వే అధికారులు, డీఆర్‌ఎం ఘటనాస్థలికి చేరుకుని నాలుగు కోచ్‌లను మళ్లీ పట్టాలపైకి తెచ్చే చర్యలు చేపట్టారు.
అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కెప్టెన్ శశి కిరణ్ చెప్పారు. ఈ సంఘటన వల్ల రైళ్ల రాకపోకల్లో ఎలాంటి అంతరాయం కలగలేదన్నారు. రెండో లైను గుండా రైళ్లు వెళ్తున్నాయని చెప్పారు. మెయింటెనెన్స్ నిమిత్తం రైలు మదార్ యార్డ్‌కు వెళ్తుండగా 12988 అనే నంబరు గల రైలు పట్టాలు తప్పినట్లు అధికారులకు సమాచారం అందినట్లు పేర్కొన్నారు.

అనంతరం రైలు పట్టాలు మార్చే ప్రక్రియ ప్రారంభమైందని, రేక్ ఖాళీగా ఉన్నందున, ఎవరికీ ఎటువంటి గాయాలు గానీ, ప్రాణ నష్టం జరగలేదని వివరించారు. డిసెంబర్ నెల ప్రారంభంలో ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కసారా - సెంట్రల్ రైల్వే నెట్‌వర్క్‌లోని TGR-3 స్టేషన్ మధ్య డిసెంబర్ 24న గూడ్స్ రైలుకు చెందిన ఏడు లోడెడ్ వ్యాగన్లు పట్టాలు తప్పాయి.
#WATCH | Ajmer, Rajasthan: Four coaches of Ajmer-Sealdah Express derailed this morning at around 7.50 at the Madar Railway Yard due to rollover while releasing the safety brakes. Railway officials and DRM are at the spot, and the operations to put the four coaches back on the… pic.twitter.com/oOtE19tsmP
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 25, 2023
రైలు పట్టాలు తప్పడం వల్ల డౌన్‌లైన్‌లోని కసర-ఇగత్‌పురి సెక్షన్‌లో మెయిల్ ఎక్స్‌ప్రెస్ ట్రాఫిక్ నిలిచిపోయింది. అంతకుముందు, బాంద్రా టెర్మినస్-జోధ్‌పూర్ సూర్యనగరి ఎక్స్‌ప్రెస్ (12480) ఈ ఏడాది జనవరిలో నార్త్ వెస్ట్రన్ రైల్వే (NWR) జోధ్‌పూర్ డివిజన్‌లోని రాజ్‌కియావాస్ - బొమద్రా సెక్షన్ మధ్య పట్టాలు తప్పింది. ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో 11 కోచ్‌లు దెబ్బతిన్నాయి. జోధ్‌పూర్ డివిజన్‌లోని రాజ్‌కియావాస్-బొమద్ర సెక్షన్ మధ్య ఈ ఘటన జరిగింది.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications