Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అఖిలేష్ యాదవ్‌కు తప్పిన ప్రమాదం: కాన్వాయ్‌లో కార్లను ఢీకొన్న మరో కారు, ముగ్గురికి గాయాలు

సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్దోయ్ జిల్లాలో ఆయన కాన్వాయ్‌ వెనుక వస్తున్న వాహనాలను ఓ కారు బలంగా ఢీకొట్టింది.

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్దోయ్ జిల్లాలో ఆయన కాన్వాయ్‌ వెనుక వస్తున్న వాహనాలను ఓ కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ప్రమాదానికి గురైన కారులో ఉన్న ముగ్గురు గాయపడ్డారు. దాదాపు ఏడు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు 100 కిలోమీటర్ల దూరంలో చోటు చేసుకుంది.

అయితే, ఈ ప్రమాదంలో అఖిలేష్ యాదవ్ కాన్వాయ్‌లోని వాహనాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ మేరకు పోలీసులు తెలిపారు. కాగా, ప్రమాదానికి సంబంధించిన విషయం తెలుసుకున్న అఖిలేష్ యాదవ్ కాన్వాయ్ ను అక్కడే కొద్దిసేపు ఆపారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించాల్సిందిగా ఆదేశించారు.

Akhilesh Yadavs convoy met with an accident; several hurt as cars crash.

అనంతరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అక్కడ్నుంచి వెళ్లిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ కారు అదుపుతప్పి.. అఖిలేష్ యాదవ్ కాన్వాయ్ వెనుక వస్తున్న వాహనాలను బలంగా ఢీకొట్టింది. అయితే, ఈ ఘటనలో అఖిలేష్ యాదవ్ కాన్వాయ్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదని హర్దోయ్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+