ఫోర్బ్స్ జాబితాలో హీరో అక్షయ్‌కు చోటు..ఒక్క సినిమాపై సంపాదనెంతో తెలుసా..?

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక పారితోషకం అందుకుంటున్న సెలబ్రిటీల్లో బాలీవుడ్ హార్ట్ థ్రోబ్ అక్షయ్ కుమార్ ఒకరని ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ఫోర్బ్స్ వెల్లడించింది. ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో అక్షయ్ కుమార్‌కు 35వ స్థానం దక్కింది. ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో తొలిస్థానంలో నిలిచాడు టేలర్ స్విఫ్ట్.

బాలీవుడ్‌లోనే అత్యధిక పారితోషకం పొందుతున్న అక్షయ్ కుమార్.. ఒక సినిమాపై రూ.35 నుంచి 70 కోట్లు సంపాదిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్‌ చేతిలో మరిన్ని కొత్త కాన్సెప్ట్‌లతో రాబోతున్న చిత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. మిషన్ మంగళ్, హౌజ్‌ఫుల్ 4, గుడ్‌న్యూస్, లక్ష్మీ బాంబ్, సూర్యవంశి అనే చిత్రాలతో అక్షయ్ బిజీగా ఉన్నాడు. ఇక సినిమాల నుంచి వచ్చే ఆదాయం పక్కనబెడితే తాను చేస్తున్న పలు అడ్వర్టయిజ్‌మెంట్ల నుంచి కూడా ఇన్‌కం బాగానే ఉన్నట్లు ఫోర్బ్స్ మ్యాగజైన్ వెల్లడించింది.ప్రస్తుతం అక్షయ్ 20కి పైగా బ్రాండ్లకు ఎండోర్స్ చేస్తున్నాడు.

Akshay finds place in Forbes for highest paid celebrity

జూన్ 2018 నుంచి జూన్ 2019కి సంపాదనలో అక్షయ్ కుమార్ అంతర్జాతీయ స్టార్లయిన రిహన్నా, జాకీచాన్, బ్రాడ్లీ కూపర్, స్కేర్లెట్ జోహ్నసన్‌లను దాటిపోయారు. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్‌కు అక్షయ్ సంపాదన రూ.444 కోట్లుగా ఉన్నట్లు ఫోర్బ్స్ పత్రిక తెలిపింది. ఇక తన సినిమాల పరంగా చూస్తే ప్రస్తుతం అక్షయ్ కుమార్ మిషన్ మంగల్ విడుదల కార్యక్రమంలో బిజీగా ఉన్నాడు. ఆగష్టు 15న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం అంగారక గ్రహంపై భారత్ పంపిన మార్స్ ఆర్బిటర్ మిషన్‌ చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం కేవలం తన కూతురు కోసమే చేసినట్లు చెప్పిన అక్షయ్ కుమార్... తన కూతురు వయస్సున్న పిల్లలు మనదేశంలో జరిగే కొన్ని నిజమైన విషయాలను తెలుసుకుంటారన్న ఉద్దేశంతోనే సినిమా చేసినట్లు చెప్పాడు. వినోదంతో పాటు ఈ చిత్రం స్ఫూర్తిని కూడా నింపుతుందన్న ఆశాభావం అక్షయ్ వ్యక్తం చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+