ఫిబ్రవరి 2018లోగా ఆధార్ అనుసంధానించాల్సిందే.. లేకుంటే సిమ్ కార్డులు పనిచేయవు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: మొబైల్‌ సిమ్‌ కార్డుల విషయంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రతి మొబైల్‌ నెంబరును ఆధార్‌కు జత చేయడం తప్పనిసరి చేసింది. 2018 ఫిబ్రవరి నాటికి అనుసంధాన ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. గడువులోగా అనుసంధానం పూర్తి చేయకుంటే సిమ్‌లు పనిచేయవని స్పష్టం చేసింది.

ఇప్పటికే పలు టెలికాం కంపెనీలు సిమ్‌ కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేయాలని కోరుతూ వినియోగదారులకు సందేశాలు పంపుతున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

sims-aadhaar

లోక్‌నీతి ఫౌండేషన్‌ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మొబైల్‌ నంబర్లకు ఆధార్‌ను అనుసంధానించాలని తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. తప్పుడు చిరునామాలతో నకిలీ సిమ్‌కార్డులు తీసుకొని ఉపయోగిస్తున్న నేరస్థులు, మోసగాళ్లు, ఉగ్రవాదులకు అడ్డుకట్ట వేయొచ్చని అధికారులు భావిస్తున్నారు.

సిమ్‌ కార్డు విక్రయ సమయంలో వినియోగదారుడి ఫింగర్ ప్రింట్ ను బయోమెట్రిక్ విధానంలో తీసుకొని దాన్ని ఆధార్‌తో సరిపోల్చి నేరగాళ్లను గుర్తించే అవకాశం ఉంటుంది. మరింకేంటి.. త్వరపడండి.. గడువులోగా మీ సిమ్ కార్డును ఆధార్ తో అనుసంధానించండి!

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
"The Government is moving ahead with linking Aadhaar with mobile SIM cards and all unlinked phones will be deactivated after February 2018," PTI reported. The report further said, "Telecom operators are not supposed to store the biometrics or any other personal data of the subscriber." "Biometrics collected should be encrypted by the telecom company and sent to UIDAI at that moment itself and any storage of biometric by a service provider is a criminal offense punishable with up to three years of imprisonment under the Aadhaar Act 2016," report added.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి