మహారాష్ట్రలో కరోనా సెకండ్‌వేవ్- సునామీ తప్పదన్న ఉద్ధవ్- క్రాకర్స్ కాలిస్తే చాలన్న అజిత్ పవార్
మహారాష్ట్రలో త్వరలో కరోనా సెకెండ్ వేవ్ ప్రభావం తప్పదన్న హెచ్చరికలు సాధారణ ప్రజల్లో ఆందోళన కలిగిస్తుండగా.... అటు సంకీర్ణ ప్రభుత్వంలోనూ చిచ్చుకు కారణమవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో లాక్‌డౌన్ విధించేందుకు ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఎన్సీపీ తప్పుబడుతోంది.
దీపావళి సందర్భంగా రోడ్లపైకి వచ్చిన జనం వైరస్‌ను చంపేస్తారేమో అన్నట్లు అనిపించిందంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జనం ఎక్కువగా రోడ్లపైకి రావడం మంచిదే అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలున్నాయి. అయితే సీఎం ఉద్ధవ్ థాక్రే మాత్రం జనం రోడ్లపైకి రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం కరోనా సెకండ్‌వేవ్ సునామీలా విరుచుకుపడబోతోందన్న హెచ్చరికలు వస్తున్నాయి. వ్యాక్సిన్ రాగానే రాష్ట్రానికి 25 కోట్ల డోసులు అవసరమవుతాయి. ఆ లోపు మాస్కులు, భౌతికదూరం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం తక్షణావసరమని ఉద్ధవ్ పేర్కొన్నారు.

Recommended Video
మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్ధితుల దృష్ట్రా రాత్రి పూట కర్ఫూ విధించాలని తనకు కొందరు సలహా ఇచ్చారని, కానీ ఆంక్షలతో మార్పు రాదని, ప్రజలు బాధ్యతాయుతంగా ఉంటేనే మార్పు సాధ్యమవుతుందని ఉద్దవ్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఉద్ధవ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. కానీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మాత్రం 8 నుంచి 10 రోజుల్లో దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications