Amazon: గ్రేట్ ఇండియన్ సేల్‌కు అమెజాన్ రెడీ, వీటిపై భారీ డిస్కౌంట్లు, స్పెషల్ ఆఫర్లు

హైదరాబాద్: పండగల సీజన్ మొదలు కావడంతో ఈ-కామర్స్ దిగ్గజాలు భారీ ఆఫర్లకు తెరతీస్తున్నాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్(Flipkart) బిగ్ బిలియన్ డేస్ తీసుకొస్తున్నట్లు ప్రకటించగా.. తాజాగా, మరో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon)కూడా కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభించేందుకు రెడీ అయ్యింది.

త్వరలో ఈ సేల్ ప్రారంభం కాబోతోందని సంబంధిత బ్యానర్‌ను అమెజాన్ వెబ్‌సైట్/యాప్‌లో ఇప్పటికే ప్రదర్శిస్తోంది. అయితే, ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఎప్పట్నుంచనే విషయం మాత్రం వెల్లడించలేదు. అయితే, అక్టోబర్ మొదటి లేదా రెండో వారం నుంచి ఈ సేల్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Amazon Great Indian Sale 2023: special Offers, Discounts, Category Specific Deals

అక్టోబర్‌లో దసరా పండగను పురస్కరించుకుని అమెజాన్, ఫ్లిక్‌కార్ట్ తమ వినియోగదారులకు భారీ డిస్కౌంట్లను అందించేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఏడాది అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో ఎస్బీఐ(SBI) డెబిట్/క్రెడిట్ కార్డు వినియోగదారులకు సేల్‌లో 10 శాతం డిస్కౌంట్ అందించనుంది.

మొబైల్స్, టీవీలు, ఫ్యాషన్, హోం, ఎలక్ట్రానిక్స్, బుక్స్, అలెక్సా డివైజ్‌ల ఈ సేల్‌లో మంచి డిస్కౌంట్లు లభించనున్నాయి. త్వరలోనే వీటిపై ఎంతెంత డిస్కౌంట్లు ఇచ్చే విషయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.ఇటీవల విడుదలైన ఐకూ జడ్ 7 ప్రో, హానర్ 09 ప్రో 5జీ ఫోన్లపై డిస్కౌంట్లు ఉండనున్నట్లు అమెజాన్ సంకేతాలిచ్చింది.

వీటితోపాటు శాంసంగ్ ఎం34, వన్ ప్లస్ నార్డ్ సీఈ3, రియల్‌మీ 60 5జీ వంటి ఫోన్లను ఆఫర్లపై విక్రయించనున్నట్లు వెల్లడించింది. అలెక్సా డివైజ్‌ల ధరలు రూ. 2499 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫైర్ టీవీ స్టిక్ రూ. 1799, కిండ్లే రూ. 6799, అలెక్సా స్మార్ట్ హోం డివైజ్‌లు రూ. 2649 నుంచి ప్రారంభమవుతాయని అమెజాన్ వెల్లడించింది.

అంతేగాక, ఐఫోన్ పాత మోడళ్లను కొనుగోలు చేయాలనుకునేవారు ఈ సేల్‌లో తక్కువ ధరకే పొందే అవకాశం కల్పించింది. కాగా, ప్రైమ్ సబ్‌స్క్రైబర్లకు ఎర్లీ యాక్సెస్, ఫ్రీ 1 డే డెలివరీ వంటి సదుపాయాలను కల్పిస్తున్న విషయం తెలిసిందే. తొలిసారి అమెజాన్ ద్వారా ఆర్డర్ చేసేవారికి వెల్‌కమ్ రివార్డు అందిస్తామని తాజాగా, అమెజాన్ ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+