1990లో ట్రంప్ తాజ్ మహల్ యజమాని, వివాదాలతో నాడు అమ్మేశాడు, నేడు భారత్ లో స్వయంగా తాజ్!
న్యూఢిల్లీ/ న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి భారతదేశ పర్యటనకు వచ్చారు. భారత్ పర్యటన సందర్బంగా ట్రంప్ కుటుంబ సమ్మేతంగా ప్రపంచ అద్బుతాల్లో ఒకటైన తాజ్ మహల్ ను స్వయంగా సందర్శించారు. అయితే తాజ్ మహల్ కు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు 30 ఏళ్ల క్రితమే విడదీయరాని ఓ అనుబంధం ఉంది. 1990లో ట్రంప్ చేతిలో ఓ ప్రైవేట్ తాజ్ మహల్ ఉండేది. అయితే వివాదాలు చుట్టుముట్టడంతో తాజ్ మహల్ ను విక్రయించిన ట్రంప్ తరువాత అమెరికా అధ్యక్షుడి హోదాలో ఇప్పుడు స్వయంగా తాజ్ మహల్ వీక్షించారు.
Recommended Video


ట్రంప్ తాజ్ మహల్ కాసినో కింగ్
అమెరికా అధ్యక్ష పదవి చేపట్టక ముందే డొనాల్డ్ ట్రంప్ చేతిలో విలాసవంతమైన తాజ్ మహల్ కాసినో ( పేకాట కేంద్రం) ఉండేది. ట్రంప్ విలాసవంతమైన తాజ్ మహల్ కాసినోను ఏర్పాటు చేసిన తరువాత ఆయన దాని మీద మోజు పెంచుకున్నారు. రష్యాకు చెందిన అనేక మంది అండర్ వరల్డ్ డాన్ లు ఇదే తాజ్ మహల్ కాసినోలో పేకాట ఆడుతూ ఏంజాయ్ చేస్తూ కాలం గడిపేవారు.

ట్రంప్ కు తాజ్ మహల్ అంటే మోజు
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందే డొనాల్డ్ ట్రంప్ అనేక వ్యాపారాలు చేశారు. రియల్ ఎస్టేట్ కింగ్ గా పేరు తెచ్చుకున్న ట్రంప్ చాలా వ్యాపారాలు చేసి మంచి వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో తాజ్ మహల్ కాసినో మీద ట్రంప్ చాలా మోజు పెంచుకున్నారు.

1990లో ట్రంప్ చేతిలో తాజ్ మహల్
డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాపారాల్లో ట్రంప్ రిసార్ట్స్ అండ్ కసినో పేరుతో అనేక రిసార్ట్స్ లు, కాసినోలు ఇప్పటికీ ఉన్నాయి. న్యూజెర్సీలోని అంట్లాంటా నగరంలో 1990లో ట్రంప్ తాజ్ మహల్ కాసినోను అధికారికంగా ఆయనే స్వయంగా ప్రారంభించారు. తాజ్ మహల్ కాసినోకు ప్రపంచంలోని 8వ వింత అనే ట్యాగ్ లైన్ ను జతచేశారు.

వేరే కంపెనీ నుంచి తాజ్ మహల్ ను కొనేసిన ట్రంప్
నిజానికి తాజ్ మహల్ కాసినో వేరే కంపెనీ ప్రారంభించింది. అయితే తాజ్ మహల్ కాసినోను మధ్యలోనే ట్రంప్ కంపెనీ స్వాధీనం చేసుకుంది. ఆర్థిక లావాదేవీల కారణంగా ఆ కంపెనీ నుంచి అనూహ్యంగా అనేక వివాదాలు, సమస్యల మధ్యలో తాజ్ మహల్ కాసినోను ట్రంప్ స్వాధీనం చేసుకున్నారు. తరువాత తాజ్ మహల్ కాసినోను విలాసవంతంగా తీర్చిదిద్దిన ట్రంప్ తరువాత దానిని 1990లో అధికారికంగా ప్రారంభించారు.

తాజ్ మహల్ తో ట్రంప్ కు లాభాలే లాభాలు
తాజ్ మహల్ కాసినోను ప్రారంభించిన తరువాత ట్రంప్ కు భారీ లాభాలు వచ్చాయి. అయితే తాజ్ మహల్ కాసినో రెండు సార్లు దివాలా తాసింది. తరువాత ట్రంప్ ఎంటర్నైన్ మెంట్ రిసార్ట్స్ పేరుతో తాజ్ మహల్ పేరుతో మళ్లీ ప్రారంభించారు. అనేక సంవత్సరాల పాటు ఇదే పేరుతో ట్రంప్ దానిని నిర్వహించారు.

తాజ్ మహల్ ను అమ్మేసిన ట్రంప్
2016 సంవత్సరం వరకు తాజ్ మహల్ కాసినో ట్రంప్ చేతిలో ఉంది. 2017లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాక ముందు అనేక అపవాదులు ఆయన మీద ఉన్నాయి. తన మీద ఉన్న అపవాదులు తొలగించుకునే పనిలో పడిన ట్రంప్ విలాసవంతమైన తాజ్ మహల్ కాసినో పేకాట కేంద్రాన్ని విక్రయించేసి చేతులు దులుపుకున్నారు.

నిజమైన తాజ్ మహల్ ముందు ట్రంప్ ఫ్యామిలీ
2017లో తాజ్ మహల్ కాసినోను విక్రయించిన ట్రంప్ ఆపేరుకు దూరం అయ్యారు. 2020 లో భారత్ పర్యటనకు వచ్చిన ట్రంప్ కుటుంబ సమ్మేతంగా ఆగ్రాలోని నిజమైన తాజ్ మహల్ ముందు నిలబడి మురిసిపోయారు. తాజ్ మహల్ కాసినో దూరం అయిన తరువాత ట్రంప్, ఆయన సతీమణి మెలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడితో కలిసి నిజమైన తాజ్ మహల్ ను వీక్షించి అక్కడి నుంచి సంతోషంగా వెనుతిరిగారు.
-
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications