స్టార్ హొటల్లో విదేశీ మహిళ పట్ల అసభ్య ప్రవర్తన, బాలుడి అరెస్టు

బెంగళూరు: బెంగళూరు నగరంలోని ఒక స్టార్ హొటల్లో విదేశీ మహిళతో అసభ్యంగా ప్రవర్థించిన బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. మండ్యకు చెందిన మైనర్ బాలుడిని బెంగళూరులోని శేషాద్రిపురం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మల్లేశ్వరం సమీపంలోని శేషాద్రిపురంలో ఒక స్టార్ హొటల్ ఉంది. మండ్య కు చెందిన బాలుడు (17) బెంగళూరు చేరుకుని ఈ స్టార్ హొటల్లో పని చేస్తున్నాడు.

అమెరికాకు చెందిన మహిళ పనిపై బెంగళూరుకు వచ్చారు. ఈమె శేషాద్రిపురంలోని స్టార్ హొటల్లో బస చేశారు. బుధవారం రాత్రి మహిళ గదిలో ఉన్నారు. ఆ సమయంలో బాలుడు ఒక్కసారిగా గదిలోపలికి చొరబడ్డాడు. ఎందుకు వచ్చావని విదేశీ మహిళ ప్రశ్నించారు. మీరు కాఫి ఆర్డర్ ఇచ్చారు కదా ఆలస్యం అవుతుందని చెప్పడానికి వచ్చానని బాలుడు సమాధానం ఇచ్చాడు.

American women herasment in bangalore

తాను ఏమి అర్డర్ ఇవ్వలేదని వెంటనే నీవు గదిలో నుండి బయటకు వెళ్లాలని విదేశీ మహిళ గట్టిగా హెచ్చరించారు. ఆ సమయంలో బాలుడు ప్యాంట్ తీసి వేసి విదేశీ మహిళతో అసభ్యంగా ప్రవర్థించాడు. ఆ సమయంలో ఆమె కేకలు వెయ్యడానికి ప్రయత్నించారు. ఆ సందర్బంలో బాలుడు గదిలో నుండి బయటకు వచ్చి పరారైనాడు. తరువాత విదేశీ మహిళ హొటల్ మేనేజర్ కు జరిగిన విషయం చెప్పింది. మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు గాలించి బాలుడిని పట్టుకుని విచారణ చెయ్యడంతో అతను మైనర్ అని వెలుగు చూసింది. బాలుడిని బాల నేరస్తుల న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. తరువాత బాలుడిని ప్రభుత్వ బాలమందిరానికి తరలించారు. సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. బాలుడిని స్టార్ హొటల్ లో పనికి పెట్టుకున్న యాజమాన్యం మీద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు, మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+