మాజీ ఉపరాష్ట్రపతి ధన్ కర్ హౌస్ అరెస్ట్ ? అమిత్ షా రియాక్షన్ ఇదే..!

అనూహ్య పరిణామాల మధ్య అనారోగ్య కారణాలు చూపుతూ హఠాత్తుగా ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకున్న జగ్ దీప్ ధన్ కర్ ఆ తర్వాత ఏం చేస్తున్నారనే చర్చ కొన్నిరోజులుగా జరుగుతోంది. ఓవైపు కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఎన్డీయే, ఇండియా కూటమి పక్షాలు ముమ్మర కసరత్తు చేస్తున్న నేపథ్యంలో మాజీ ఉపరాష్ట్రపతి ధన్ కర్ ను హౌస్ అరెస్టు చేశారన్న మరో చర్చ కూడా సాగుతోంది. దీనిపై ఇప్పటివరకూ కేంద్రం స్పందించకపోవడంతో ఊహాగానాలు కాస్తా నిజమనే అనిపించాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. జగ్ దీప్ ధన్ కర్ ను ఉపరాష్ట్రపతి పదవి నుంచి బలవంతంగా దింపేశారన్న విమర్శల్ని కేంద్రంలో బీజేపీ ఎదుర్కొంటున్న వేళ అమిత్ షా ఆయన హౌస్ అరెస్టు ప్రచారంపై స్పందించారు. ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ జగ్ దీప్ ధన్ కర్ అరెస్టుపై విపక్షాలు చేస్తున్న ప్రచారంపై అమిత్ షా మండిపడ్డారు. ధన్ కర్ రాజీనామాపై ఊహాగానాలు చేస్తే చర్యలు తప్పవనే హెచ్చరికలు కూడా పంపారు.

Amit Shah Breaks Silence on House Arrest of Former VP Jagdeep Dhankhar

నిజం, అబద్ధాల గురించి మీరు చెప్పే వివరణ ప్రతిపక్షం చెప్పే దాని ఆధారంగా ఉన్నట్లు అనిపిస్తుందంటూ ఏఎన్ఐ వార్తా సంస్థ ప్రశ్నకు సమాధానంగా అమిత్ షా వ్యాఖ్యానించారు. మనం వీటన్నిటి గురించి గొడవ చేయకూడదన్నారు. ధన్ కర్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారని, రాజ్యాంగం ప్రకారం తన విధులను నిర్వర్తించారని ఆయన గుర్తుచేశారు. వ్యక్తిగత ఆరోగ్య కారణాల వల్ల ఆయన రాజీనామా చేశారన్నారు. ఈ విషయంపై పెద్దగా ఆలోచించకూడదన్నారు.

Amit Shah Breaks Silence on House Arrest of Former VP Jagdeep Dhankhar

ధన్ కర్ ను ప్రభుత్వం మౌనంగా ఉంచిందని పేర్కొంటూ ప్రతిపక్ష నాయకులు ఆకస్మిక రాజీనామా గురించి ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు చెప్పినట్లుగా ధన్ కర్ గృహ నిర్బంధంలో ఉన్నారన్న వాదనను ఆయన కొట్టిపారేశారు. మాజీ ఉపాధ్యక్షుడి రాజీనామాపై గొడవ చేయవద్దని అమిత్ షా హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై విపక్ష ఇండియా కూటమి నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+