దక్షిణాదిపై అమిత్ షా ఫోకస్: జయ, కేసీఆర్‌తో ఢీ!

న్యూఢిల్లీ/హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా దక్షిణాది పైన పార్టీని విస్తరించే అంశంపై దృష్టి సారించారట. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లో అమిత్ షా ప్రణాళికలతో బీజేపీ ఏకంగా 73 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన దృష్టి దక్షిణాది రాష్ట్రాల పైన పడిందట. ఇందులో భాగంగా తెలంగాణలో తెరాసను ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తున్నారట.

బీజేపీకి ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాలలోనే మంచి పట్టు ఉంది. దక్షిణాదిన, ఈశాన్య రాష్ట్రాలలో బలం లేదు. ఇటీవలి ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, కేరళలలో ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో పొత్తు భాగంగా ఎన్డీయే కూటమికి ఎక్కువ సీట్లు వచ్చాయి. అయితే, టీడీపీతో కలవకుంటే ఏపీలోను ఇప్పుడు ఉన్న రెండు సీట్లను మించక పోయేవి అనే వారు లేకపోలేదు.

ఉత్తరాదిన, ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ విజయఢంగా మోగించింది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపి, చత్తీస్ గఢ్, బీహార్ రాష్ట్రాలలో బీజేపీ ప్రతిపక్షాలను మట్టి కరిపించింది. ఒక్క పశ్చిమ బెంగాల్‌లో మాత్రమే మమతా బెనర్జీని గట్టిగా ఢీకొనలేకపోయింది. అయితే, ఇన్నాళ్లు మమత ఆధ్వర్యంలోని టీఎంసీ, లెఫ్ట్ పార్టీలు ప్రత్యర్థులుగా ఉండేవి. ఇప్పుడు టీఎంసీకి బీజేపీ ప్రత్యర్థి అనే స్థాయిలో మాత్రం ఓటింగ్ శాతాన్ని పెంచుకుంది.

కిషన్ రెడ్డితో అమిత్ షా

కిషన్ రెడ్డితో అమిత్ షా

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి శనివారం న్యూఢిల్లీలో కలుసుకున్నారు.

కిషన్ రెడ్డితో అమిత్ షా

కిషన్ రెడ్డితో అమిత్ షా

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి శనివారం న్యూఢిల్లీలో కలుసుకున్నారు. అమిత్ షాకు శాలువా కప్పి సన్మానించారు.

కిషన్ రెడ్డితో అమిత్ షా

కిషన్ రెడ్డితో అమిత్ షా

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి శనివారం న్యూఢిల్లీలో కలుసుకున్నారు. పుష్పగుచ్చం ఇస్తున్న కిషన్.

కేసీఆర్

కేసీఆర్

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా దక్షిణాది రాష్ట్రాల పైన దృష్టి సారించనున్నారు. ఆయన తెలంగాణలో పార్టీ పటిష్టత కోసం కసరత్తు చేస్తున్నారట.

జయలలిత, కరుణానిధి

జయలలిత, కరుణానిధి

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా దక్షిణాది రాష్ట్రాల పైన దృష్టి సారించనున్నారు. తమిళనాడులో బీజేపీ పలు పార్టీలతో పొత్తు పెట్టుకుంది. జయలలిత, కరుణానిధిలను ధీటుగా ఎదుర్కొనేందుకు ఆయన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల అనంతరం దృష్టి సారించనున్నారట.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీని పక్కన పెట్టి టీఎంసీకీ ధీటుగా ఎదిగేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. అయితే, 2019 నాటికి ఈ పరిస్థితి ఉండక పోవచ్చు. ఇప్పుడు ఎక్కువ స్థానాలు గెలుచుకున్న యూపీ, రాజస్థాన్, ఎంపీ, చత్తీస్ గఢ్, బీహార్ రాష్ట్రాలలో సీట్లు దక్కవచ్చు. ఈ నేపథ్యంలో అమిత్ షా దక్షిణాది పైన ప్రధానంగా కన్ను వేశారట. దక్షిణ భారత దేశంలోని కర్నాటకలో మాత్రమే ఇప్పటి వరకు బీజేపీ అధికారంలోకి రాగలిగింది. మిగతా రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం అంతంత మాత్రమే.

ఈ నేపథ్యంలో యూపీలో బీజేపీకి మంచి స్థానాలు కట్టబెట్టిన అమిత్ షా అధ్యక్షుడు అయ్యారు. దక్షిణాధి రాష్ట్రాల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలు, 2019 సార్వత్రిక ఎన్నికల పైన ఆయన ఆయా రాష్ట్రాల నేతలతో ప్రణాళికలు రచిస్తున్నారట. ఏపీలో టీడీపీతో కలిసి బీజేపీ వెళ్తోంది. తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని ఢీకొట్టేందుకు ఆయన పావులు కదుపుతున్నారట. తెరాసను ఎదుర్కొనే అంశం పైన ప్రత్యేక దృష్టి సారించారట.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి బీజేపీ కూడా ఎంతో పోరాడింది. ఈ నేపథ్యంలో ఆయన కసరత్తు చేస్తున్నారట. అయితే, ఇటీవల పోలవరం అంశంపై కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ.. అది రాజకీయపరమైన వ్యతిరేకత మాత్రమేనని, ఎందుకంటే ఆ ఆర్డినెన్స్ తయారు చేసింది యూపీఏ కాబట్టి తెలంగాణలో చొచ్చుకు పోవచ్చునని తెలంగాణ బీజేపి నేతలు భావిస్తున్నారు. అలాగే మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాలలోని ఎన్నికల తర్వాత ఆయన తెలంగాణ పైన పూర్తిగా దృష్టి సారించనున్నారట.

ఇక, తమిళనాడులో విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే, పిఎంకే వంటి పలు పార్టీలతో బీజేపీ కలిసి వెళ్తోంది. అక్కడ జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకె, కరుణానిధి నేతత్వంలోని డీఎంకేను, కేరళలో యూడీఎప్, ఎల్‌డీఎఫ్, కర్నాటకలో కాంగ్రెసు, జెడి(ఎస్)లను ఎదుర్కొనేందుకు అమిత్ షా కసరత్తు ప్రారంభించారట. అయితే, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక పూర్తిస్థాయిలో దక్షిణాది పైన దృష్టి సారించనున్నారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+