amit shahకు సొంత కారు లేదట.. అవాక్కయ్యేలా అమిత్ షా ఆస్తులు, అప్పులు!!
దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న వేళ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించి అనేక అంశాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా వారు అఫిడవిట్ లో పేర్కొన్న ఆస్తులు, అప్పులకు సంబంధించిన డేటా జనాలను విస్తుపోయేలా చేస్తుంది. బిజెపిలో రెండో పవర్ ఫుల్ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దాఖలు చేసిన ఆస్తులు, అప్పులు ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
అమిత్ షా అఫిడవిట్ లో వివరాలిలా
కేంద్ర హోంశాఖ మంత్రిగా, బిజెపిలో చక్రం తిప్పే నేతగా పనిచేస్తున్న అమిత్ షా నిన్న గుజరాత్ లోని గాంధీనగర్ లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఆయన తనకు సొంత కారు లేదని, మన పేరుతో ఎటువంటి వాహనం లేదని వెల్లడించారు. తన ఆస్తుల లెక్కలను చెప్పిన ఆయన మొత్తం ఆస్తులు విలువ రూ. 36కోట్లని, ఇందులో స్థిరాస్తులు రూ.20కోట్లు కాగా, చరాస్తులు రూ.16కోట్లు ఉన్నాయని వెల్లడించారు.

అమిత్ షా సతీమణి ఆస్తుల, అప్పుల వివరాలివే
72 లక్షల రూపాయలు విలువచేసే బంగారు ఆభరణాలు, 15.77 లక్షల అప్పు ఉందని అఫిడవిట్ లో వెల్లడించారు. అమిత్ షా సతీమణి సోనాల్ కు 31 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని, 1.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆమె పేరు పై 26.32లక్షల అప్పు ఉందని ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించారు.
ఆదాయ మార్గాలపై అమిత్ షా వ్యాఖ్యలు
తన ఆదాయ మార్గాలపై వివరణ ఇచ్చిన అమిత్ షా వృత్తి రీత్యా తను రైతునని పేర్కొన్నారు అమిత్ షా. ఇప్పటివరకు ఆయనపై మూడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. కేంద్ర మంత్రిగా వచ్చే వేతనంతో పాటు, ఇంటి అద్దెల ద్వారా, వ్యవసాయం ద్వారా, షేర్లు మరియు డివిడెండ్లు ద్వారా తను ఆదాయాన్ని సంపాదిస్తున్నట్టు అమిత్ షా తన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు.
గాంధీ నగర్ నుండి అమిత్ షా నామినేషన్
2022-23లో అమిత్ షా వార్షిక ఆదాయం రూ.75.09 లక్షలని అఫిడ్‌విట్‌లో వెల్లడించారు. ఇదిలా ఉంటే ఆయన 1997 నుంచి రాజకీయాలను చేస్తున్నారు. 1997లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన అమిత్ షా గత 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యే గాను, ఎంపీ గాను సేవలందిస్తున్నారు. ప్రస్తుతం గాంధీనగర్ నుండి ఎంపీగా బరిలోకి దిగిన అమిత్ షా నామినేషన్ కూడా దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications