వచ్చే ఏడాది మోడీ రిటైర్మెంట్-అమిత్ షాకు ప్రధాని పగ్గాలు-కేజ్రివాల్ కు హోంమంత్రి కౌంటర్..!

దేశవ్యాప్తంగా నాలుగో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు సిద్ధమవుతున్న వేళ లిక్కర్ స్కాం కేసులో జైలు నుంచి మధ్యంతర బెయిల్ పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలు నుంచి విడుదల కాగానే ప్రెస్ మీట్ పెట్టి ప్రధాని మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షానూ టార్గెట్ చేశారు. ముఖ్యంగా ప్రధాని మోడీ వచ్చే ఏడాది రిటైర్మెంట్ తీసుకోబోతున్నారని కేజ్రివాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

ప్రధాని మోడీకి వచ్చే ఏడాదికి 75 ఏళ్లు నిండుతాయని, గతంలో బీజేపీ నేతలైన అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి వారిని ఈ కారణంగానే రిటైర్మెంట్ ఇచ్చేశారని కేజ్రివాల్ గుర్తుచేశారు. కాబట్టి ఇప్పుడు ప్రధాని మోడీ కూడా రిటైర్మెంట్ తీసుకుని తన తర్వాత స్ధానంలో ఉన్న అమిత్ షాకు పగ్గాలు అప్పగిస్తారని కేజ్రివాల్ తెలిపారు. ఈ లెక్కన చూస్తే మోడీ ఇస్తున్న హామీలకు అమిత్ షా గ్యారంటీయా అని ప్రశ్నించారు. దీంతో కేజ్రివాల్ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.

amit shah s counter to Arvind Kejriwal s pm modi retirement remark says no such rule

కేజ్రివాల్ వ్యాఖ్యలపై అమిత్ షా స్పందించారు. కేజ్రివాల్ అండ్ కో, ఇండియా కూటమి లేవనెత్తిన ఈ వాదన పూర్తిగా తప్పని అమిత్ షా తెలిపారు. బీజేపీ రాజ్యాంగంలో అలాంటి నిబంధనేదీ లేదని వెల్లడించారు. ప్రధాని మోడీ ఈ సారి తన పదవీకాలం పూర్తి చేసుకుంటున్నారని, భవిష్యత్తులోనూ ఆయనే ప్రధానిగా కొనసాగుతారని షా పేర్కొన్నారు. బీజేపీలోనూ దీనిపై ఎలాంటి గందరగోళం లేదన్నారు. కేజ్రివాల్ కు కోర్టులో లభించింది మధ్యంతర బెయిలే అన్నది గుర్తుంచుకోవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+